T20 World Cup: సెమీస్‌లో టీమిండియాకు ‘గండం’.. రోహిత్ సేనకు పెను సవాలే..

|

Nov 07, 2022 | 7:45 PM

5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన టీమిండియా గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక గురువారం అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది.

T20 World Cup: సెమీస్‌లో టీమిండియాకు గండం.. రోహిత్ సేనకు పెను సవాలే..
Virat Kohli
Follow us on

టీ20 ప్రపంచకప్‌లోని లీగ్ స్టేజి చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై టీమిండియా అద్భుత విజయాన్ని సాధించి సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. 5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన టీమిండియా గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక గురువారం అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో భారత జట్టు అంచనాలు మించి రాణిస్తున్నప్పటికీ.. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై గెలవడం అంత సులువు కాదు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఇంగ్లీష్ టీమ్.. టీమిండియాకు సమవుజ్జీ అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ రసవత్తరంగా సాగడం పక్కా. గత గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. టీమిండియాకు సెమీఫైనల్ గండం పొంచి ఉందని చెప్పొచ్చు. గత నాలుగు ఐసీసీ ట్రోఫీల సెమీ ఫైనల్స్‌లో భారత్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.

గత నాలుగు ఐసీసీ ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లు చూస్తే.. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోగా.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచింది. అటు 2016 T20 ప్రపంచకప్‌ సెమీ-ఫైనల్స్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది, ఇక 2015 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాభవం ఎదుర్కుంది.

  • 1983 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ ఓడించింది
  • 1987 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది
  • 1996 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయింది
  • 1998 ICC ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది
  • 2000 ICC ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం.
  • 2002 ICC ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం
  • 2003 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్‌లో కెన్యాను భారత్ ఓడించింది.
  • 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది
  • 2011 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను భారత్ ఓడించింది.
  • 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో శ్రీలంకను భారత్ ఓడించింది
  • 2014 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను భారత్ ఓడించింది.
  • 2015 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది.
  • 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి.
  • 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించింది.
  • 2019 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది.

కాగా, ఈ గణాంకాలు చూస్తే.. గురువారం ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ టీమిండియాకు పెద్ద సవాల్ అని చెప్పాలి. ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని, ఆ జట్టులో హిట్టర్లు ఉన్నారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లలో టీమిండియా అద్భుతంగా రాణిస్తేనే.. విజయం సాధించగలదని చెబుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..