T20 World Cup 2021: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కివీస్‌తో పోరుకు ఆరో బౌలర్ సిద్ధం..!

|

Oct 27, 2021 | 9:36 PM

హార్దిక్ పాండ్యా బౌలింగ్‌కు ఫిట్‌గా ఉన్నాడు. బుధవారం నెట్ ప్రాక్టీస్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. ఆదివారం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు సిద్ధమయ్యాడు.

T20 World Cup 2021: టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కివీస్‌తో పోరుకు ఆరో బౌలర్ సిద్ధం..!
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 31వ తేదీ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోతే.. సెమీస్‌కు వెళ్లడం కష్టతరమవుతుంది. అసలు భారత్ సెమీఫైనల్స్‌కు చేరాలంటే ఏం చేయాలి.?
Follow us on

T20 World Cup 2021, India vs New Zealand: 2021 టీ20 వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో చెమటోడ్చుతోంది. బుధవారం భారత జట్టు దుబాయ్‌లో నెట్స్ ప్రాక్టీస్ చేసింది. ఐసీసీ క్రికెట్ అకాడమీ మైదానంలో జరుగుతున్న ఈ ప్రాక్టీస్‌తో భారత అభిమానులకు గొప్ప వార్త అందింది. విశేషం ఏమిటంటే.. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రాక్టీస్ సమయంలో బౌలింగ్ చేస్తూ కనిపించాడు. నెట్స్‌లో హార్దిక్ పాండ్య పూర్తి శక్తితో బౌలింగ్ చేయడంతోపాటు అతని పేస్ ఆశ్చర్యపరిచింది.

హార్దిక్ పాండ్యా వెన్ను గాయం నుంచి ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. అతను ఐపీఎల్‌లో ఒక్క బంతి కూడా వేయలేదు. టీ20 ప్రపంచకప్‌లో మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై కూడా బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే ప్రస్తుతం పాండ్యా బౌలింగ్‌ను తరువాతి మ్యాచులో చూడొచ్చు.

Hardik Pandya Bowling

హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకపోవడంతో భారత జట్టు సమతుల్యత దెబ్బతింది. ప్రస్తుతం ఈ ఆటగాడు బౌలింగ్‌ చేసేందుకు ఫిట్‌గా ఉన్నప్పటికీ, న్యూజిలాండ్‌పై టీమిండియా బలంగా కనిపిస్తుంది. పాండ్యా బౌలింగ్ చేయడానికి పూర్తి ఫిట్‌గా ఉంటే, ఖచ్చితంగా రెండవ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగం అవ్వనున్నాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో పాటు పాకిస్తాన్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి గ్రూప్ 2 నుంచి సెమీఫైనల్‌కు తొలి పోటీదారుగా మారింది. ఈ మ్యాచ్ భారత జట్టుకు చాలా కీలకమైనది.

Also Read: T20 World Cup 2021, ENG vs BAN: బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతు..? 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం

IND vs NZ: పాక్‌తో బెడిసికొట్టిన వ్యూహం.. ‘ప్లాన్ బీ’తో కివీస్‌ పోరుకు సిద్ధమైన కోహ్లీసేన.. ఏం చేయనున్నారంటే?

ENG vs BAN, T20 World Cup 2021: ఇంగ్లండ్ దెబ్బకు బంగ్లా టైగర్స్ విలవిల.. పరుగులు చేయలేక నానా తంటాలు