IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎ను ఆటలాగే చూడండి.. యుద్ధంలా కాదు..

| Edited By: Venkata Chari

Oct 24, 2021 | 5:34 PM

భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ భారత్, పాకిస్తాన్ టీ20 మ్యాచ్‎పై మాట్లాడాడు. ఈ మ్యాచ్‎ను కేవలం ఆటగా చూడాలని.. యుద్ధంగా చూడొద్దని అభిమానులను కోరాడు...

IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎ను ఆటలాగే చూడండి.. యుద్ధంలా కాదు..
Kief
Follow us on

భారత మాజీ బ్యాట్స్‌మెన్ మహ్మద్ కైఫ్ భారత్, పాకిస్తాన్ టీ20 మ్యాచ్‎పై మాట్లాడాడు. ఈ మ్యాచ్‎ను కేవలం ఆటగా చూడాలని.. యుద్ధంగా చూడొద్దని అభిమానులను కోరాడు. రాజకీయాలు, ద్వేషానికి, అహంకారానికి దూరంగా క్రికెట్‌ను చూడటం ఎల్లప్పుడూ మంచిదని కైఫ్ అన్నాడు. ఈ రోజు జరగబోయే మ్యాచ్‎లో కోహ్లీ, బాబర్ నాయత్వంలో ఇరుజట్లు పోటీ పడినప్పుడు అభిమానులందరి దృష్టి మ్యాచ్‎పై ఉంటుందని చెప్పాడు. భారత్, పాకిస్తాన్ చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరిస్ అడాయి.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ స్కోర్, లైవ్ బ్లాగ్ ఇక్కడ చూడండి

ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్‌ దారులు ఖజానాను నింపుకోవడం కోసం ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. “ఈ ఉద్రిక్త ఉదయం, ఒక చిన్న సల‎హా. రాజకీయాలు, ద్వేషం, అహంకారం నుండి దూరంగా ఉండటం ద్వారా క్రికెట్ చూడటం ఎల్లప్పుడూ గొప్ప ఆలోచన. రోజును ఆస్వాదించండి, మీ ప్రత్యర్థి ఓటమిని కాకుండా మీ గెలుపును జరుపుకోండి. దాన్ని యుద్ధంగా కాదు, ఆటలాగా భావించండి. #indvspak” అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం తొలిసారి ప్రపంచ కప్ మ్యాచ్‌లో కెప్టెన్‌లుగా తలపడనున్నారు.

పెనర్లు రోహిత్ శర్మ భారత్‎కు, మహ్మద్ రిజ్వాన్ పాక్‎కు “మ్యాచ్ విన్నర్లు” పాక్ మాజీ ఆటగాడు యూనిస్ ఖాన్ అన్నారు. ఇరువైపుల పేస్ సమానంగా ఉందన్నారు. జస్ప్రిత్ బుమ్రా ‘మెన్ ఇన్ గ్రీన్’ కి కీలక ముప్పు అని పేర్కొన్నారు. “పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు మంచి స్థితిలో ఉన్నారు. ఇండియా పేస్ విభాగం ఇటివల కాలంలో కూడా గణనీయంగా మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా బుమ్రా గత కొన్ని నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పాడు. కోహ్లీ, బాబర్‎కు పోలికే లేదన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఇంకా ప్రారంభించలేదు. బాబర్ ఇంకా చిన్నవాడని అభిప్రాయపడ్డాడు. “కోహ్లీ 2008 లో నేను ఆడుతున్నప్పుడు అరంగేట్రం చేశాడు” అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అన్నాడు. రోహిత్ శర్మ, బుమ్రాతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు.

Read Also… T20 World Cup 2021: అదిరిపోయే క్యాచ్ పట్టిన ఐడెన్ మక్రమ్.. పెవిలియన్ చేరిన స్టీవ్ స్మిత్..