T20 World Cup 2021, IND vs SCO: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కివీస్ సారథి కేన్ విలియమ్సన్ అలాగే పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ లాంటి కీలక స్టార్ల నుంచి మా ఆటగాళ్లు నేర్చుకోవాల్సింది చాలా ఉందని స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కోయెట్జర్ పేర్కొన్నాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో రేపు (నవంబర్ 5)న స్కాట్లాండ్‌తో భారత్ పోరాడనుంది. ఈమేరకు మ్యాచ్ ముందు మాట్లాడిన స్కాంట్లాండ్ సారథి.. విరాట్ కోహ్లి మాటీం ప్లేయర్లతో మాట్లాడి స్ఫూర్తి నింపాలని ఈ సందర్భంగా విన్నవించాడు.
“ఇలాంటి స్టార్ ప్లేయర్లతో మేం మాట్లాడాలని కోరుకుంటాం. కారణం వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈ టోర్నమెంట్‌లో మాటీంకు చాలా అనుభవం లభించింది. టీమిండియా, న్యూజిలాండ్, పాక్, బంగ్లాదేశ్ లాంటి టీంలతో ఆడడం మాకు కలిసొచ్చింది. ఉత్తమ ప్లేయర్లతో మైదానం పంచుకోవడంతో చాలా విషయాలు తెలియశాయని పేర్కొన్నాడు.
రేపు జరగబోయే మ్యాచ్ సందర్భంగా టాస్‌లో కోహ్లితో వెళ్లడం ప్రత్యేక రోజుగా మిగలనుంది. ఎందరో ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ జట్టుతో పోరాడినప్పుడు కూడా ఇలాంటి అనుభూతే కలిగింది. భారత్‌తో జరిగే మ్యాచులో మేం శాయశక్తులా పోరాడి, కోహ్లీసేనను ఓడిస్తామని భావిస్తున్నాం. టీమిండియాతో పోరు కఠినమైన సవాలే, కానీ, మేం 100 శాతం ప్రయత్నిస్తే అది సాధ్యం కాగలదు అని తెలిపాడు.
Also Read: Pakistan vs West Indies: పాకిస్తాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వెస్టిండీస్.. అందేంటో తెలుసా?
Virat Kohli Dance Video: మైదానంలో కేక పుట్టించిన విరాట్ కోహ్లీ.. వైరలవుతోన్న వీడియో..