T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై చారిత్రాత్మక ఓటమి టీమిండియాకు కష్టతరంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత, ప్రస్తుతం భారత జట్టు టోర్నమెంట్‌లో తమ మిగిలిన నాలుగు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫైనల్ దారిలో ఇంగ్లండ్‌తో తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో ఓడించడం చాలా కష్టంగా పరిగణించబడుతోంది. అయితే టీమిండియా ముందున్న పరిస్థితులపై ఓ లుక్ వేద్దాం..
ఒక్క మ్యాచ్‌లో ఓడిపోతే, చివరి 4 పోటీలపై ప్రభావం.. పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ జట్లు భారత జట్టు గ్రూపులో ఉన్నాయి. టీమిండియా పేపర్ బలం మేరకు చూస్తే రెండు అసోసియేట్ దేశాలైన నమీబియా, స్కాట్లాండ్‌లపై టీమిండియాతోపాటు, న్యూజిలాండ్, పాకిస్తాన్ సులభంగా గెలుస్తాయి. అంటే ఈ మ్యాచ్‌లతో మూడు జట్లకు తలో 2 పాయింట్లు రావడం ఖాయం.
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ గురించి మాట్లాడితే, మూడు జట్ల విజయం లేదా ఓటమి మ్యాచ్ రోజు వారి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీ20 క్రికెట్‌లో ఏలాంటి జట్టుపైనేనా ప్రభావం చూపగలదు.
ఆఫ్ఘనిస్థాన్‌లోని మూడు జట్లు కూడా తమ తమ మ్యాచ్‌లను గెలుస్తాయని అనుకుంటే, పాకిస్తాన్ 8 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉండగా, భారత్-న్యూజిలాండ్ జట్లు తలో 6 పాయింట్లతో రెండవ స్థానంలో ఉంటాయి.
ఇక టీమిండియా, న్యూజిలాండ్‌తో పోటీపడడం చాలా కీలకం కానుంది. ఇక్కడ సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి భారత్ ఏ సందర్భంలోనైనా 8 పాయింట్లు సాధించాలంటే న్యూజిలాండ్‌ను తప్పక ఓడించాలి. అలాగే న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తే… అటువంటి పరిస్థితిలో, భారత జట్టు రెండవ స్థానంలో నిలిచే అవకాశం ఉంది. అలాగే సెమీ ఫైనల్ టికెట్ పొందుతుంది.
పాకిస్థాన్‌ని ఓడించడంలో న్యూజిలాండ్ జట్టు విజయవంతమైతే, గ్రూప్‌లోని మూడు జట్లకు తలో 8 పాయింట్లు ఉంటాయి. ఈ పరిస్థితులలో, సెమీ ఫైనల్స్ టికెట్ రన్ రేట్‌పై ఆధారపడుతుంది. దీనిలో ఏ జట్టు అయినా ముందుకు సాగవచ్చు.
టీమిండియా నంబర్ 2లో ఉంటే, ఇంగ్లండ్‌తో ఢీకొనవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా టీ 20 క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. దీని ఆధారంగా ఇంగ్లండ్ తన గ్రూప్‌లోని అన్ని మ్యాచ్‌లను గెలవడం ద్వారా నంబర్ వన్‌గా మారే అవకాశం ఉంది. ఐసీసీ వరల్డ్ టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా ఇంగ్లండ్ నిలకడగా నంబర్ వన్‌లో కొనసాగుతోంది. ఇది దాని బలాన్ని తెలియజేస్తుంది.
తమ గ్రూప్‌లో భారత్ రెండో స్థానంలో ఉంటే, సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ఫైనల్ మార్గంలో టీమిండియాకు కఠినమైన సవాలు తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు, సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక లేదా దక్షిణాఫ్రికాతో తలపడాల్సి వస్తే టీమిండియా విజయావకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయనడంలో సందేహం లేదు.
Also Read: IND vs PAK: ఇండియా కొంపముంచినవి.. పాక్‌కు కలిసొచ్చిన అంశాలు ఇవే..