Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే...

Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!
Babar

Updated on: Nov 12, 2021 | 10:04 AM

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీఫైనల్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. లీగ్ స్టేజిలో వరుసగా విజయాలు నమోదు చేసిన బాబర్ ఆజామ్ సేన.. ఆసీస్ చేతుల్లో ఘోర ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో అసలేం జరిగిందో తెలుసా.? బాబర్ ఆజామ్ ఏం చెప్పాడో వింటే మీరు కూడా వావ్ అంటారు.

‘బాహుబలి’ సినిమా అందరూ చూసే ఉంటారు. అందులో తన సైన్యాన్ని చావు భయం నుంచి తప్పించేందుకు ‘బాహుబలి’ ప్రభాస్ గొప్పగా స్పూర్తి నింపుతాడు. సరిగ్గా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ కూడా ఇదే పని చేశాడు.. తన ప్లేయర్స్‌లో స్పూర్తిని నింపాడు. ఆస్ట్రేలియా చేతుల్లో ఓటమి అనంతరం పాక్ జట్టు మొత్తం నిరాశతో ఉండిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ అంతా సైలెంట్‌గా ఉంది. ఈ తరుణంలో కెప్టెన్ బాబర్ ఆజామ్.. తన ప్లేయర్స్‌ను ఉత్సాహపరుస్తూ అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు. సుమారు రెండున్నర నిమిషాల పాటు సాగిన అతడి స్పీచ్‌.. ‘కొంచెం స్వీట్‌గా.. కొంచెం హాట్‌గా’ అనిపించింది. అక్కడ బాహుబలి తన సైన్యానికి మరణం అర్ధాన్ని వివరిస్తే.. ఇక్కడ బాబర్ తన సైన్యానికి ఓటమి అర్ధాన్ని చెప్పుకొచ్చాడు.

”జరగాల్సింది జరిగిపోయింది. ఈ ఓటమి గురించి ఎవరూ మాట్లాడొద్దు. అలాగే ఈ ఓటమికి ఎవరినీ నిందించవద్దు. మేము చాలా కష్టపడి ఓ అద్భుత టీంను నిర్మించగలిగాం. దానిని కొనసాగించాలి. ఈ ఓటమిని త్వరగా మర్చిపోయి.. జట్టుగా ముందుకు కదలాలి. తప్పు ఎక్కడ చేశామో దానిపై దృష్టి సారించాలి. ఈ ఓటమి గురించి ఎవ్వరూ చర్చించుకోవద్దు. ఈ ఓటమి గురించి ఎవరైనా మాట్లాడుకున్నట్లు వింటే.. వారితో నా తీరు భిన్నంగా ఉంటుందని” బాబర్ ఆజామ్ పేర్కొన్నాడు. కాగా, కెప్టెన్ స్పీచ్ అనంతరం.. కోచ్‌లు హేడెన్, ఫిలాండర్, సక్యులిన్ ముస్తాక్‌లు కూడా జట్టును తమ స్పీచ్‌లతో ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Also Read:

మగ సింహంపై విరుచుకుపడ్డ రెండు ఆడ సింహాలు.. యుద్ధం మాములుగా లేదు.. చూస్తే షాకవుతారు!

Viral Photo: ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో గుర్తించండి.. చాలామంది ఫెయిల్ అయ్యారు.!

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. టీ20 జట్టులో కోహ్లీ స్నేహితుడికి నో ప్లేస్.. లిస్టులో మరో ఐదుగురు.!

Viral Video: ఇదేం క్రియేటివిటీ మావా.. ఈ వ్యక్తి చేసిన ఇన్వెన్ష‌న్‌కు ఇంజనీర్లు సైతం షాకవుతారు.!

ధోని స్థానాన్ని భర్తీ చేసేది అతడే.! వచ్చే ఏడాది సీఎస్‌కే రిటైన్ చేసే ఆటగాళ్లు వీరే.!

Loading...
Unable to load recommendations.
Follow Us