T20 Blast: టీ20 క్రికెట్ అంటేనే సంచనాలకు కేంద్ర బిందువు. ఎందరో ఆటగాళ్లు పలు రికార్డులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి, తమదైన ముద్ర వేసుకున్నారు. అది అంతర్జాతీయమైన, ఐసీఎల్ అయినా, దేశవాళీ లీగులైనా సరై.. అన్నింట్లోనూ పలు రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది టీ20 క్రికెట్. తాజాగా ఇంగ్లండ్‌లో జరుగుతోన్న టీ20 బ్లాస్ట్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాకు చెందిన 26 ఏళ్ల వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ తాజాగా ఓ ఫీట్ సాధించాడు.
టీ20 బ్లాస్ట్‌లో వోర్సెస్టర్షైర్ వర్సెస్ లీసెస్టర్షైర్ మ్యాచ్ జరిగింది. ఇందులో వోర్సెస్టర్షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో జోస్ తన జట్టు కోసం అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. వోర్సెస్టర్షైర్ మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 20 ఓవర్లలో 169 పరుగులు చేసింది. లీసెస్టర్షైర్ ముందు 170 పరుగుల లక్ష్యం ఉంది.
వోర్సెస్టర్షైర్ ఇచ్చిన లక్ష్యంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన లీసెస్టర్షైర్ జట్టు ఆరంభంలో తడబడింది. కానీ, జోస్ ఇంగ్లిస్‌కు బ్యాటింగ్‌తో పరిస్థితి మారిపోయింది. సెంచరీ సాధించడంతో పాటు మ్యాచును గెలిపించి ఔరా అనిపంచాడు. ఓపెనింగ్‌కు వచ్చిన ఇంగ్లిస్ 72 నిమిషాలు బ్యాటింగ్ చేసి 61 బంతుల్లో 118 పరుగులు సాధించాడు. 193.44 స్ట్రైక్ రేట్‌లో బ్యాటింగ్ చేసిన జోస్ ఇంగ్లిష్.. 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదేశాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్‌లో 88 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్ల నుంచి వచ్చాయి. టీ20 బ్లాస్ట్‌లో జోస్ ఇంగ్లిస్‌కు రెండవ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. కేవలం 3 వికెట్ల కోల్పోయి 17.5 ఓవర్లలో టార్గెట్‌ను చేరుకుంది.
Also Read:
ENG vs PAK: భారీ సిక్స్ చూశారా? ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచులో బాదేసిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్..!
IND vs SL: అరంగేట్ర మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు.. కృనాల్ పాండ్య తర్వాత..!
Tokyo Paralympics 2020: అథ్లెట్‌గా మారిన కలెక్టర్.. సరికొత్త రికార్డుతో పారా ఒలింపిక్స్‌కు పయనం!