అరివీర భయంకరం.. 55 ఫోర్లు, 52 సిక్సర్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి రూ. 20 లక్షలతో ఎంట్రీ.?

ఐపీఎల్ 2024 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఈ రిచ్చెస్ట్ లీగ్‌తో స్టార్ ఆటగాళ్లతో సహా యంగ్ ప్లేయర్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్‌ ద్వారా టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలువురు యంగ్ సెన్సేషన్లను ఎంపిక చేయనున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. మరి ఆ లిస్టులోనే చేరతాడు ఈ యంగ్ ప్లేయర్.

అరివీర భయంకరం.. 55 ఫోర్లు, 52 సిక్సర్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఐపీఎల్‌లోకి రూ. 20 లక్షలతో ఎంట్రీ.?
Swastik Chakara

Updated on: Mar 18, 2024 | 1:16 PM

ఐపీఎల్ 2024 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తున్న ఈ రిచ్చెస్ట్ లీగ్‌తో స్టార్ ఆటగాళ్లతో సహా యంగ్ ప్లేయర్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సీజన్‌ ద్వారా టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పలువురు యంగ్ సెన్సేషన్లను ఎంపిక చేయనున్నారు బీసీసీఐ సెలెక్టర్లు. మరి ఆ లిస్టులోనే చేరతాడు ఈ యంగ్ ప్లేయర్. అతడే స్వస్తిక్ చికారా. యూపీకి చెందిన చికారాను రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 20 లక్షలకు ఐపీఎల్ 2024 మినీ వేలంలో కొనుగోలు చేసింది. తుఫాన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్ చికారా.. ఇటీవల జరిగిన యూపీ టీ20 లీగ్‌లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

టీమిండియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ని ఆదర్శంగా తీసుకుని తన క్రికెట్ కెరీర్‌ను మొదలుపెట్టాడు స్వస్తిక్ చికారా. తొలిసారిగా 2019లో స్థానికంగా జరిగిన బైద్యాని రాంప్రసాద్ బిస్మిల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌లో 167 బంతుల్లో ఏకంగా 585 పరుగులు చేసి.. దేశవాళీ క్రికెట్‌ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆ ఇన్నింగ్స్‌తో అతడికి ఉత్తరప్రదేశ్‌ తరఫున సీకే నాయుడు టోర్నీలో ఆడే అవకాశం దక్కింది. పొలార్డ్ లెక్క.. చికారా తన బ్యాట్‌తో మొదటి బంతి నుంచే పరుగుల వరద పారిస్తాడు. టీ20ల్లో కొడుకు డబుల్ సెంచరీ చేయాలన్నది చికారా తండ్రి కల. ఇక ఆ కల నెరవేర్చాలనుకుంటున్నాడు చికారా.

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ తరపున వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు చికారా. విరాట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ధోని చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు మిగిలిన జట్లకు కూడా స్వస్తిక్ చికారాతో ముప్పే అని చెప్పొచ్చు. కాగా, 2017లో ఢిల్లీకి పంత్ అరంగేట్రం చేసిన మునుపు.. 2016 అండర్-19 ప్రపంచకప్‌లో పంత్ మెరిశాడు. సేమ్ టూ సేమ్ పంత్ మాదిరిగా చికారా కూడా నిర్భయంగా క్రికెట్ ఆడతాడని ఢిల్లీ యాజమాన్యం భావిస్తోంది.