Suryakumar Yadav Scores Century: ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) మరోసారి విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy)లో తన తుఫాను బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. జైపూర్ వేదికగా పుదుచ్చేరితో జరుగుతోన్న మ్యాచ్‌లో సూర్యకుమార్ కేవలం 50 బంతుల్లోనే అద్భుత సెంచరీని సాధించాడు. అంతేకాకుండా తాను భారత్ జట్టుకు ఎంపిక కావడం కరెక్ట్ అని విమర్శకుల నోరు మూయించాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
గత కొన్నేళ్లుగా సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఇక చివరి అతని శ్రమ ఫలితాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులో చోటు సంపాదించాడు. ఇక ఈ తుఫాన్ ఇన్నింగ్స్ తర్వాత విమర్శకులు సూర్యకుమార్ యాదవ్ ఎంపికను సమర్ధించారు. (Suryakumar Yadav Scores Century)
పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 58 బంతుల్లోనే 133 పరుగుల చేసి జట్టుకు భారీ స్కోర్ అందించడంలో కీలకపాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. వరుస ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడంటే.. సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం ఏమేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సూర్యకుమార్ యాదవ్ వేగానికి పంకజ్ సింగ్ బ్రేక్ వేశాడు. 47వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ప్రయతించిన సంగనకల్ సింగ్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూర్యకుమార్ మొత్తం 133 పరుగులు చేయగా.. కేవలం 58 బంతుల్లోనే ఆ స్కోర్ అందుకోవడం విశేషం. ఇక ఇదే మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ పృథ్వీ షా డబుల్ సెంచరీ బాదాడు.
ముంబై కెప్టెన్ పృథ్వీ షా సెంచరీని 65 బంతుల్లో పూర్తి చేయగా.. ఆ ఫీట్‌ను అందుకోవడంలో 18 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తరువాత, అతను 77 బంతుల్లో డబుల్ సెంచరీని చేరుకున్నాడు. ఈ తరుణంలో అతడు 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ విధంగా 152 బంతుల్లో 27 ఫోర్లు, 4 సిక్సర్ల సహాయంతో డబుల్ సెంచరీకి చేరుకోగలిగాడు. అంతకుముందు ఫిబ్రవరి 21న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో షా 89 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 105 నాటౌట్గా నిలిచాడు. ఇక ఫిబ్రవరి 23న మహారాష్ట్రపై 38 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ డబుల్ సెంచరీతో, షా ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
హైదరాబాద్‌లోని బాలానగర్ ఫ్లైఓవర్ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!
Fight With Cheetah: చావు తప్పదనుకుని.. చిరుతతో ఫైట్ చేసిన రియల్ హీరో.. చివరికి ఏమైందంటే.!
ఈ వింత షార్క్ పిల్ల.. అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ అట.! నిజంగానే కోట్లు తెచ్చిపెడుతుందా.?