టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఇప్పుడు కెరీర్‌లోనే టాప్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 అయినా, వన్డే అయినా పరుగుల వరద పారించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయిన ఎస్కేవై కొత్త కారు కొన్నాడు. Mercedes Benz GLS AMG 63 కారును సొంతం చేసుకున్నాడు. ముంబైలోని ఆటో హ్యాంగర్ నుంచి ఈ లగ్జరీ కారును సేల్స్ ప్రతినిధులు డెలివరీ చేశారు. ఈ సందర్భంగా కార్ డీలర్‌షిప్ షోరూమ్‌లో సూర్య కోసం అదిరిపోయే ఏర్పాట్లు చేశారు. అతను సెంచరీ చేసినప్పుడు దిగిన ఫొటో. అలాగే తన 360 ట్రేడ్ మార్క్ సంబంధించిన స్టిల్స్ బొమ్మలను ఏర్పాటు చేశారు. రంగురంగూల బెలూన్లతో అలంకరించిన కొత్త కారును సూర్యకు అందజేశారు. సూర్యతో పాటు అతని భార్య దేవిషా శెట్టి తమ కొత్త కారు ముందు ఫొటోలు దిగి మురిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఈ కొత్త కారు ధర దాదాపు రూ.2.15కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
కార్లంటే యమ క్రేజ్..
కాగా సూర్యకు కార్లంటే బాగా ఇష్టం. ఇప్పటికే అతని గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూఈ 5 సిరీస్, ఆడీ ఏ6, రేంజ్ రోవర్, హుండాయ్ ఐ20, ఫార్చూనర్, పోర్షే టర్బో 911 తదితర లగ్జరీ కార్లు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనల్లో అద్భుతంగా రాణించాడీ స్టార్ బ్యాటర్. పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో పరుగుల వరద పారించాడు. ఈక్రమంలోనే త్వరలో జరిగే ఆసియా కప్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఆగస్ట్ 27నుండి యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. భారత్ ఆగస్ట్ 28న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో తలపడనుంది.
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..