దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్.. డివిలియర్స్ స్టైల్‌లో ఓపెనింగ్ షాట్.. వీడియో వైరల్.!

India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో..

దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్.. డివిలియర్స్ స్టైల్‌లో ఓపెనింగ్ షాట్.. వీడియో వైరల్.!
Suryakumar Yadav
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 19, 2021 | 8:09 AM

India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ స్టైల్ లో సూర్య తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో మొదటి బంతిని సిక్సర్‌గా మలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సూర్యకుమార్ యాదవ్‌ ఈ సిరీస్ రెండో మ్యాచ్‌లో అరంగేట్రం చేయగా.. ఆ మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ 57 పరుగులు చేశాడు. అద్భుత అర్ధ శతకాన్ని సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. నాలుగో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం విదితమే. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-2తో సమం అయింది. చివరి టీ20 శనివారం అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదికగా జరగనుంది.

కాగా, నాలుగో టీ20లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా.. ఆ తర్వాత లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లు ముగిసేసరికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్టోక్స్, రాయ్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ మూడు వికెట్లు తీయగా.. చాహర్, పాండ్యాలు రెండేసి వికెట్లు పడగొట్టారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!