Suryakumar Yadav: 26 బంతుల్లో 200పైగా స్ట్రైక్ రేట్‌.. లంక బౌలర్లను ఉతికారేసిన మిస్టర్ 360 ప్లేయర్..

రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన భారత్‌ను సూర్య కుమార్ ఆదుకున్నాడు. గిల్‌తో కలిసి 53 బంతుల్లో 111 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో సూర్య కేవలం 26 బంతుల్లో తన 14వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

Suryakumar Yadav: 26 బంతుల్లో 200పైగా స్ట్రైక్ రేట్‌.. లంక బౌలర్లను ఉతికారేసిన మిస్టర్ 360 ప్లేయర్..
Surya Kumar Yadav

Updated on: Jan 07, 2023 | 8:17 PM

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-శ్రీలంక టీ20 సిరీస్‌లో మూడో, నిర్ణయాత్మక మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ 13 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్ గిల్, సూర్యకుమార్ ఉన్నారు. రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ ఒక పరుగు చేకసి, పెవిలియన్ చేరాడు. దిల్షాన్ మధుశంక, చమిక కరుణరత్నేలకు ఒక్కో వికెట్ పడగొట్టారు.

సూర్య తుఫాన్ ఇన్నింగ్స్..

రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన భారత్‌ను సూర్య కుమార్ ఆదుకున్నాడు. గిల్‌తో కలిసి 53 బంతుల్లో 111 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో సూర్య కేవలం 26 బంతుల్లో తన 14వ టీ20 హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం సూర్య 5 ఫోర్లు, 6 సిక్సులతో 34 బంతుల్లో 77 పరుగులతో ఆడుతున్నాడు.

పవర్‌ప్లేలో 2 వికెట్లు కోల్పోయిన భారత్..

భారత్ పవర్‌ప్లే తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఒక పరుగు చేసి, దిల్షాన్ మధుశంక వేసిన రెండో బంతికి ధనంజయ్ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చాడు. అతని తర్వాత, రాహుల్ త్రిపాఠి 16 బంతుల్లో వేగంగా 35 పరుగులు చేశాడు. కానీ, శుభ్‌మన్ గిల్‌తో కలిసి 49 పరుగులు జోడించిన తర్వాత అతను కూడా చమికా కరుణరత్నే చేతికి చిక్కాడు. పవర్‌ప్లేలో భారత్ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..