ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్- 2022 (IPL 2022) కొత్తగా ఉండనుంది. ఎనిమిది జట్లకు బదులుగా 10 జట్లతో కొత్త ఫార్మాట్ ఆసక్తికరంగా ఉండనుంది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ లీగ్ కోసం జట్లు తమ సన్నాహాలను ప్రారంభించాయి. అలాగే బ్రాడ్‌కాస్టర్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ కూడా సన్నాహాలు చేస్తోంది. ఛానెల్ తన వ్యాఖ్యాన బృందాన్ని(కామెంటేటర్ గ్రూప్) కూడా సిద్ధం చేసింది. అయితే ఈసారి మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆవతారం ఎత్తబోతున్నాడు. అతను గత ఐపీఎల్ కూడా ఆడాడు. కానీ ఇప్పుడు అతన్ని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో వ్యాఖ్యాతగా అరంగేట్రం చేయబోతున్నాడు. ఫేమస్ కామెంటేటర్ రవిశాస్త్రి(Ravi shastri)తో వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. అతనే వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా(Suresh Raina).
వీరిద్దరూ ఐపీఎల్‌కు కామెంటరీ టీమ్‌లో సభ్యులుగా ఉంటారని స్టార్ స్పోర్ట్స్ ఒక ట్వీట్‌లో తెలిపింది. శాస్త్రికి గతంలో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఇండియా జట్టుకు కోచ్ అయిన తర్వాత మానేశాడు. అయితే గత ఏడాది T20 ప్రపంచకప్ తర్వాత, శాస్త్రి టీమ్ ఇండియాను విడిచిపెట్టాడు. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న శాస్త్రి ఇప్పుడు మళ్లీ మైక్ పట్టుకోనున్నాడు. IPL-2022 ఆటగాడిగా రైనాకు పీడ కలను మిగిల్చింది. మిస్టర్ ఐపీఎల్‌గా పేరుగాంచిన ఈ ఆటగాడిని మెగా వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. రైనాకు మొదటి నుంచి చెన్నై సపూర్ కింగ్స్‌తో అనుబంధం ఉంది, కానీ ఈసారి మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో ఉన్న జట్టు కూడా ఈ ఆటగాడిని కొనుగోలు చేయకపోవడంతో రైనా IPLకి దూరంగా ఉండవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అతను కామెంటరీ బాక్స్‌లో తన క్రికెట్ పరిజ్ఞానాన్ని ప్రేక్షకులకు వివరించబోతున్నాడు.
Read Also.. IPL 2022: ఐపీఎల్‌లో సూపర్ సీనియర్లు వీరే.. తగ్గేదేలే అంటూ యువకులతో పోటాపోటీ.. వారెవరంటే?