Best Fielders: మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఆల్‌ టైం సూపర్ ఫీల్డర్స్‌..! వారెవరంటే..?

|

Jun 21, 2021 | 3:43 PM

క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 5 గురు ఫీల్డర్స్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డులను దక్కించుకుని ఔరా అనిపించారు. వీరంతా సూపర్ ఫీల్డింగ్‌ తో మ్యాచ్‌లను మలుపు తిప్పి ఈ అవార్డును అందుకున్నారు.

Best Fielders: మ్యాచ్‌లను మలుపు తిప్పిన ఆల్‌ టైం సూపర్ ఫీల్డర్స్‌..! వారెవరంటే..?
Best Fielders
Follow us on

Best Fielders: ఫీల్డర్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు రావడమేంటని ఆలోచిస్తున్నారా? అవును ఇప్పటి వరకు క్రికెట్‌లో ఎక్కువగా బ్యాట్స్‌మెన్లకో  లేక బౌలర్లకో లేదా ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన వారికి మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ లు లభిస్తాయి. అలా కాకుండా క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 5 గురు ఫీల్డర్స్‌ ఈ అవార్డును దక్కించుకుని ఔరా అనిపించారు. వీరంతా సూపర్ ఫీల్డింగ్‌ తో మ్యాచ్‌లను మలుపు తిప్పి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు. అలాంటి ప్లేయర్లను ఇప్పుడు చూద్దాం..

డేవిడ్ మిల్లర్ ( 4 క్యాచ్‌లు, 2 రన్‌ ఔట్‌లు)
దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన ఫీల్డింగ్‌తో ప్రత్యర్థులను కంగారు పెట్టి, ఎలాంటి మ్యాచ్‌ నైనా ఇట్టే మార్చేయగలడు. మిల్లర్ ఆటను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ చూశాం. 2019లో పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా దేశాల మధ్య టీ20 సిరీస్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి 193 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ను మిల్లర్ తన అద్భుత ఫీల్డింగ్‌తో వరుసగా వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో మిల్లర్ 2 రనౌట్లతో పాటు 4 క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో డేవిడ్ మిల్లర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

గుస్ లోగి (3 క్యాచ్‌లు, 1 రన్‌ అవుట్)
పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఈ వెస్టిండీస్ ప్లేయర్ 3 క్యాచ్‌లు, 1 రన్‌ అవుట్ చేసి సత్తా చాటాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్‌ ను గుస్‌ లోగి అద్భుత ఫీల్డింగ్‌తో భయపెట్టాడు. పాకిస్తాన్ టీం 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక ప్లేయర్లను పెవిలియన్ పంపి వెస్టిండీస్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకుగాను గుస్‌లోగికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ వరించింది.

జాంటీ రోడ్స్ (5 క్యాచ్‌లు)
జాంటీ రోడ్స్ అంటేనే ఫీల్డింగ్‌.. ఫీల్డింగ్ అంటేనే జాంటీ రోడ్స్. ఇలా పేరు సంపాదించిన ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ .. 1993లో అద్భుత ఫీల్డింగ్ తో ఈ అవార్డును అందుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో 5 క్యాచ్‌లు అందుకొని దెబ్బకొట్టాడు. సూపర్ డైవ్‌తో బ్రియాన్ లారాను పెవిలియన్ చేర్చిన జాంటీ రోడ్స్.. అనంతరం మరో క్యాచ్‌తో ఫిల్ సిమ్మన్స్‌‌ను ఔట్ చేశాడు. అలాగే జిమ్మీ ఆడామ్స్, ఆండర్సన్ కమిన్స్, డెస్మాండ్ హైనెస్ క్యాచ్‌లు అందుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

మార్క్ టేలర్(4 క్యాచ్‌లు)
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్.. 1992లో వెస్టిండీస్‌తో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో సత్తా చాటాడు. కీలకమైన నాలుగు క్యాచ్‌లు అందుకుని వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. గస్ లోగీ, కార్ల్ హూపర్, జూనియర్ ముర్రీ, కీల్ అర్థర్టన్‌లను స్లిప్‌లో అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 14 పరుగులతో విజయం సాధించింది.

వీవీ రిచర్డ్స్(3 క్యాచ్‌లు)
క్రికెట్ దిగ్గజంగా పేరుగాంచిన సర్ వీవీ రిచర్డ్స్.. 1989 లో తనదైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారత్‌తో జరిగిన సెమీ ఫైనల్లో రిచర్డ్స్ 3 క్యాచ్‌లు అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వీవీ రిచర్డ్స్ దెబ్బకు 165 పరుగులకు ఆలౌట్ అయింది. దిలీప్ వెంగ్ సర్కార్, రమన్ లంబా, మనోజ్ ప్రభాకర్‌లను పెవిలియన్ చేర్చి, భారత్ ఓటమిని శాసించాడు. దీంతో వీవీ రిచర్డ్స్‌కి మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also read:

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ముగిసిన మూడవ రోజు ఆట.. న్యూజిలాండ్ స్కోర్ 101/2…

WTC Final 2021: పుజారాపై పేలుతోన్న మీమ్స్.. ఒక్క పరుగు కోసం అన్ని బంతులా!