World Cup: తెలంగాణలో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడలేదు.. కానీ.! ప్రపంచకప్‌ గెలిచాడు.. ఎవరంటే.?

టీమిండియా జాతీయ జట్టుకు ఆడాలన్నది ప్రతీ ఆటగాడి కల. కొందరికి ఆ కల నెరవేరుతుంది. కానీ చాలామందికి ఆ కల.. కలగానే మిగిలిపోతుంది. అయితే ఇక్కడొక ప్లేయర్.. టీమిండియా తరపున ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ప్రపంచకప్ తెచ్చిపెట్టాడు. మరి అతడెవరో..? ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

World Cup: తెలంగాణలో పుట్టాడు.. టీమిండియా తరపున ఆడలేదు.. కానీ.! ప్రపంచకప్‌ గెలిచాడు.. ఎవరంటే.?
Team India

Updated on: Jan 05, 2026 | 11:01 AM

మీకు ఈ విషయం తెలుసా.? 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో తెలంగాణకు చెందిన ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఒకరు ఉన్నారు. అతడు మరెవరో కాదు సునీల్ వాల్సన్. ఈ ప్లేయర్ ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచకప్ జట్టులో ఎంపికయ్యాడు. అనుభవం లేకపోవడం వల్ల అతనికి ఆడే అవకాశం దక్కలేదు. ప్రపంచకప్ తర్వాత కూడా అరంగేట్రం చేయని ఏకైక ప్లేయర్‌గా సునీల్ వాల్సన్ అరుదైన రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళ్తే.. భారత క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన రికార్డును సునీల్ వాల్సన్ తన పేరిట లిఖించుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ప్రపంచకప్ గెలిచిన ఏకైక భారతీయ క్రికెటర్‌గా ఆయన నిలిచారు. 1983లో టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు, ఇంగ్లాండ్‌కు వెళ్లిన 14 మంది సభ్యుల జట్టులో సునీల్ వాల్సన్ ఒకరు. తెలంగాణకు చెందిన ఈ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉన్నప్పటికీ.. ఆ టోర్నమెంట్‌లో అతనికి ఆడే అవకాశం దొరకలేదు. జట్టులోని మిగిలిన 13 మంది కనీసం రెండేసి మ్యాచ్‌లు ఆడగా, సునీల్ వాల్సన్‌కు మాత్రం అనుభవం లేదనే కారణంతో తుది జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచకప్ తర్వాత కూడా సునీల్ వాల్సన్‌కు టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. దీంతో, ఒక అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే తన కెరీర్‌ను ముగించారు. అయినప్పటికీ, ప్రపంచకప్ గెలిచిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో సునీల్ వాల్సన్ పేరు ఇప్పటికీ నిలిచిపోతుంది. ఇది క్రికెట్ చరిత్రలో ఎవరూ చెరపలేని ఒక ప్రత్యేకమైన రికార్డు అని చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి