
Sunil Gavaskar vs ENG In 1975 World Cup: ఈ రోజు భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన 74వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. లిటిల్ మాస్టర్‌గా పేరుగాంచిన సునీల్ గవాస్కర్, వ్యాఖ్యాతగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఇప్పటి వరకు క్రికెట్ అభిమానులు మరిచిపోని ఓ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 1975 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ టీమ్ ఇండియా ముందుంది. ఈ మ్యాచ్ భారత్-ఇంగ్లండ్ మధ్య 7 జూన్ 1975న జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ముందు 335 పరుగుల విజయ లక్ష్యం ఉండగా సునీల్ గవాస్కర్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటుంది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 335 పరుగులకు సమాధానంగా టీమిండియా 60 ఓవర్లలో 3 వికెట్లకు 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. సునీల్ గవాస్కర్ 174 బంతుల్లో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, చాలా నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడాడు. సునీల్ గవాస్కర్ ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అతను మొత్తం 60 ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. ఆ సమయంలో ODI మ్యాచ్‌లు 50 ఓవర్లకు బదులుగా 60 ఓవర్లు ఉండేవి. సునీల్ గవాస్కర్ స్లో ఇన్నింగ్స్ కారణంగా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 20.60 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అలాగే అతను తన ఇన్నింగ్స్‌లో 1 ఫోర్ మాత్రమే కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 60 ఓవర్లలో 4 వికెట్లకు 334 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరపున డెన్నిస్ అమిస్ అద్భుత సెంచరీ ఆడాడు. ఈ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ 137 పరుగులు చేశాడు. ఇది కాకుండా కీత్ ఫ్లెచర్ 68 పరుగులు చేశాడు. క్రిస్ ఓల్డ్ కేవలం 30 బంతుల్లో 51 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 202 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే సునీల్ గవాస్కర్ స్లో ఇన్నింగ్స్ కారణంగా క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ ఇంకా గుర్తుంది. క్రికెట్ చరిత్రలో అత్యంత స్లో ఇన్నింగ్స్‌లలో ఇదొకటి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..