
Sunil Chhetri : భారత స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు సునీల్ ఛెత్రి ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. తన స్నేహితుడు విరాట్ కోహ్లీ తన ఫిట్‌నెస్ టెస్ట్ స్కోర్‌ను తనతో పంచుకున్నాడని, ఆ స్కోర్ చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పాడు. లండన్‌లో విరాట్ ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోగా, ఇతర క్రికెటర్లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఫిట్‌నెస్ టెస్ట్‌లు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ ఛెత్రి కింగ్ కోహ్లీని పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు.
కోహ్లీ, రొనాల్డో మధ్య ఉన్న పోలిక ఇదే
సునీల్ ఛెత్రి దేశీపీఎల్ పాడ్‌క్యాస్ట్‌లో మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తనతో ఫిట్‌నెస్ టెస్ట్ స్కోర్‌ను పంచుకున్నాడని తెలిపారు. కోహ్లీ అంతటి ఫిట్‌నెస్ లెవల్ ఎలాంటి సోమరిపోతు వ్యక్తిని కూడా ప్రేరేపిస్తుందని ఛెత్రి అన్నారు. “కొన్ని రోజుల క్రితం, కోహ్లీ తన ఫిట్‌నెస్ టెస్ట్ స్కోర్‌ను నాకు పంపాడు. ఇలాంటి ఫిట్ వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం చాలా మంచి విషయం” అని ఛెత్రి అన్నారు.
విరాట్ కోహ్లీ, క్రిస్టియానో రొనాల్డో మధ్య ఒక పోలిక ఉందని సునీల్ ఛెత్రి చెప్పారు. వారిద్దరూ తమ విజయాలతో ఎప్పుడూ సంతృప్తి చెందరు. “రొనాల్డోను నేను వ్యక్తిగతంగా తెలియదు. కానీ, నేను అతన్ని చూశాను. విరాట్ కోహ్లీ నాకు తెలుసు. ఇద్దరిలో ఒకేలాంటి విషయాన్ని నేను గమనించాను. అదేంటంటే, వారు సాధించిన దానితో ఎప్పుడూ సంతృప్తి చెందలేదు” అని ఛెత్రి అన్నారు. కోహ్లీ, రొనాల్డో మాదిరిగా తాను కూడా సంతృప్తి అనే భావనను దాటి ముందుకు వెళ్లాలని కోరుకున్నట్లు ఛెత్రి ఒప్పుకున్నాడు.
సునీల్ ఛెత్రి కెరీర్
సునీల్ ఛెత్రి కెరీర్ విషయానికి వస్తే అతను జూన్ 2024లో రిటైర్ అయ్యాడు. కానీ మార్చి 2025లో అతను తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతను ఏఎఫ్‌సీ ఏషియన్ కప్ 2027 క్వాలిఫయర్స్లో టీం ఇండియా కోసం మ్యాచ్‌లు ఆడాడు. అతను ఇప్పటివరకు భారత్ తరపున 155 మ్యాచ్‌లు ఆడి 95 గోల్స్ చేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..