IPL 2021 RCB vs SRH: ఐపీఎల్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. చివరి మ్యాచ్‌ని గెలుపుతో ముగించింది. టాస్ గెలిచిన కోహ్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ మొదటగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఓపెనర్లుగా జాసన్ రాయ్, అభిషేక్ వర్మ క్రీజులోకి అడుగుపెట్టారు. 13 పరుగులకే అభిషేక్ ఔటైనా రాయ్ మాత్రం తనదైన శైలిలో అలరించాడు. 38 బంతుల్లో 44 పరుగులు చేశాడు. తర్వాత కెప్టెన్ విలియమ్‌సన్ 29 బంతుల్లో 31 పరుగులు మినహాయించి పెద్దగా ఎవరూ రాణించలేదు. దీంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, క్రిస్టియన్ 2 వికెట్లు, జార్జ్ ఒక వికెట్ సాధించారు.
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగుళూరు 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కోహ్లీ నిరుత్సాహపరిచిన దేవదత్ పాడికల్ పర్వాలేదనిపించాడు. 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. తర్వాత వరుసగా రెండు వికెట్లు పడిపోయినా క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ తనదైన శైలిలో సన్ రైజ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. అయితే సన్ రైజర్స్ బౌలర్లు మూకుమ్మడిగా ఒత్తిడి పెంచడంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. ఈ క్రమంలో క్రీజులో ఏబీ డివిలియర్స్ , జార్జ్ ఉన్నారు. కానీ 8 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయారు. చివరి బంతికి సిక్స్ కొడితే విజయం దక్కేది కానీ ఆ మ్యాజిక్ జరగలేదు. ఇక సన్‌రైజర్స్ బౌలర్లు తల వికెట్ సాధించారు.