WTC Final: టీమిండియా ఫుల్ ప్రాక్టీస్​.. ఆలోచింప చేస్తున్న విరాట్ కోహ్లీ ట్వీట్

|

Jun 10, 2021 | 1:32 AM

ఇంగ్లాండ్​పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తెగ బిజీ అయ్యారు. కొన్ని రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ఫైనల్ కోసం..

WTC Final: టీమిండియా ఫుల్ ప్రాక్టీస్​.. ఆలోచింప చేస్తున్న విరాట్ కోహ్లీ ట్వీట్
Virat And
Follow us on

ఇంగ్లాండ్​పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో తెగ బిజీ అయ్యారు. కొన్ని రోజుల కఠిన క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ఫైనల్ కోసం ఇంగ్లాండ్‌లో ఉంది టీమిండియా. మూడు రోజుల కఠిన క్వారంటైన్ అనంతరం ఇప్పుడిప్పుడే గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ ఫొటోను సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్​ చేశాడు. మైదానంలో రన్నింగ్ చేసిన అనంతరం సూర్యరశ్మి పడిన ఫొటోను పెట్టాడు. ‘సూర్యుడు చిరునవ్వులను తీసుకొస్తాడు’ sun brings out smiles అనే క్యాప్షన్​కూడా జోడించాడు.

భారత ఆటగాళ్లు పుజారా, శుభ్​మన్​ గిల్​, కోహ్లీ ఇందులో ఉన్నారు. మే 3న ఇంగ్లాండ్​లో అడుగుపెట్టిన క్రికెటర్లు.. ఇప్పుడిప్పుడే తక్కువ మందితో శిక్షణను కొనసాగిస్తున్నారు. క్రమక్రమంగా జట్టు మొత్తం గ్రౌండ్​లో ప్రాక్టీస్​కు దిగనున్నారు.

మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ ఆనంతరం ఇంగ్లండ్‌లో భారత క్రికెట్‌ జట్టు ప్రాక్టీస్‌ ప్రారంభించింది. న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జూన్‌ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టారు. కఠిన క్వారంటైన్‌ ముగియడంతో.. ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు ఇదే తొలి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : కేంద్రం హెచ్చరిక: అలాంటి ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వస్తే జాగ్రత్త.. లేదంటే మోసపోవాల్సిందే..!

ప్ర‌కాశం జిల్లాలో బ‌య‌ట‌ప‌డ్డ పురాత‌న‌ వెండి నాణేలు.. ఎగ‌బ‌డ్డ స్థానికులు.. వ‌చ్చిప‌డ్డ పోలీసులు