IND Vs AUS: అలా జరిగితే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ నుంచి టీమిండియా ఔట్.!! చివరి ఫైట్‌కు అంతా సిద్దం..

|

Mar 08, 2023 | 11:44 AM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా మార్చి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్ట్ జరగనుంది.

IND Vs AUS: అలా జరిగితే.. డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ నుంచి టీమిండియా ఔట్.!! చివరి ఫైట్‌కు అంతా సిద్దం..
Team India
Follow us on

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా మార్చి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, భారత్ మధ్య నాలుగో టెస్ట్ జరగనుంది. ఇంకా స్వదేశం నుంచి ప్యాట్ కమిన్స్ తిరిగి ఇండియాకు రాకపోవడంతో నాలుగో టెస్టులోనూ స్టీవ్ స్మిత్ ఆసీస్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. తన కెప్టెన్సీతో మూడో టెస్టులో జట్టుకు అద్భుత విజయాన్ని అందించడమే కాకుండా.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్‌ను స్టీవ్ స్మిత్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అదే ఊపుతో చివరి టెస్టులోనూ విజయం సాధించి.. సిరీస్ సమం చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నాడు. మూడో టెస్టులో స్మిత్ బౌలర్లను ఉపయోగించిన తీరు.. ఫీల్డింగ్ టెక్నిక్స్‌పై అటు ఆసీస్ మాజీలు.. ఇటు టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపించిన విషయం విదితమే.

ఇదిలా ఉంటే.. టీమిండియా జట్టులోని నెగటివ్‌లు అధిగమించి.. నాలుగో టెస్టులో అద్భుత విజయాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఒకవేళ అదే జరిగితే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ బెర్త్‌ను భారత్ సుగుమం చేసుకున్నట్లే. బ్యాటింగ్‌లో చిన్న చిన్న లోపాలు మినహా.. టీమిండియాలో ప్లేయింగ్ ఎలెవన్ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. రెండేళ్ల క్రిందట అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌ను కేవలం మూడు రోజుల్లోనే టీమిండియా చిత్తు చేసిన విషయం విదితమే. అప్పుడు అశ్విన్, అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లీష్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని చూస్తోంది రోహిత్ సేన.

రిస్క్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్..

ఆసీస్‌తో టెస్ట్ సిరీస్ 2-2తో డ్రా, లేదా 2-1తో గెలిస్తే.. న్యూజిలాండ్-శ్రీలంక సిరీస్ ఫలితంపై భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ బెర్త్ ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ చేసుకుంటే.. లంకేయులతో ఆస్ట్రేలియా జట్టు ఢీకొంటుంది. అది కాకుండా శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుతుంది. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా మొదటి జట్టుగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరిన విషయం విదితమే.

ఆస్ట్రేలియా జట్టు (అంచనా):

ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నాస్ లబూషేన్, స్టీవ్ స్మిత్, పీటర్ హ్యాండ్స్‌కంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మిచిల్ స్టార్క్, నాథన్ లియాన్, టోడ్ ముర్ఫి, మాథ్యూ కుహ్నెమెన్‌

భారత్(అంచనా):

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్/ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఉమేష్ యాదవ్/ మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్