రేసులో నిలవాలంటే గెలవాల్సిందే!

| Edited By:

Jun 15, 2019 | 3:20 PM

టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పటిష్ఠంగాలేని లంకపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాలని ఆసీస్ భావిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన లంక.. అఫ్గనిస్థాన్‌పై మాత్రమే నెగ్గింది. వర్షం కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో బరిలో దిగలేకపోయిన‌ శ్రీలంక నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. పదును తగ్గిన పేస్ బౌలింగ్.. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్‌తో సతమతమవుతున్న లంక.. అన్ని విభాగాల్లో కుదురుకున్న ఆసీస్‌కు ఏ మేరకు పోటినిస్తుందో […]

రేసులో నిలవాలంటే గెలవాల్సిందే!
Follow us on

టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నె ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పటిష్ఠంగాలేని లంకపై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువాలని ఆసీస్ భావిస్తోంది. న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన లంక.. అఫ్గనిస్థాన్‌పై మాత్రమే నెగ్గింది. వర్షం కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లో బరిలో దిగలేకపోయిన‌ శ్రీలంక నేడు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. పదును తగ్గిన పేస్ బౌలింగ్.. నిలకడలేని బ్యాటింగ్ ఆర్డర్‌తో సతమతమవుతున్న లంక.. అన్ని విభాగాల్లో కుదురుకున్న ఆసీస్‌కు ఏ మేరకు పోటినిస్తుందో చూడాలి. మరోవైపు పాకిస్థాన్‌పై విజయంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా.. లంకను చితక్కొట్టి ముందుకు సాగాలని భావిస్తున్నది. పాకిస్థాన్‌పై శ‌త‌కం బాదిన విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఫించ్, స్మిత్ మంచి టచ్‌లో ఉన్నారు. స్టార్క్, కమిన్స్, కౌల్టర్‌నైల్‌తో బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణిస్త్ంది. బౌన్సర్లతో బెంబేలెత్తించే ఈ త్రయాన్ని లంక బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కుంటుందనేదానిపై శ్రీలంక గెలుపు  ఆధారపడి ఉంది.