Sri Lanka-vs Pakistan: బాబర్ ఆజం ప్రస్తుత కాలంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పరిగణిస్తుంటారు. అతడిని భారత ఆటగాడు విరాట్ కోహ్లీతో పోల్చుతుంటారు. అయితే ప్రతి బ్యాట్స్‌మెన్‌కు ఏదో ఒక బలహీనత ఉంటుంది. అలాంటి బౌలర్ ముందు ఈ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆటబొమ్మగా మారాడు. బాబర్‌ని తమ ఆటబొమ్మగా మార్చుకున్న బౌలర్లలో శ్రీలంక ఆటగాడు ప్రభాత్ జయసూర్య కూడా ఒకడు. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ బౌలింగ్‌లో బాబర్ ఎప్పుడు బలహీనంగానే కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం గాలే స్టేడియంలో శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో జయసూర్య మరోసారి బాబర్ ఆజమ్‌ను బలిపశువును చేశాడు. బాబర్ తన అసహనాన్ని ప్రదర్శించుకుంటూ పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. అతని అభిమానులను, జట్టును తీవ్రంగా నిరాశపరిచాడు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో బంతికి బాబర్ ఔటయ్యాడు. జయసూర్య సంధించిన బంతి ఆఫ్ స్టంప్‌పై పడడంతో అది లోపలికి దూసుకొచ్చింది. బాబర్ దానిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ లోపలి అంచుని తీసుకుని గాలిలోకి వెళ్లింది. వికెట్ కీపర్ సదీర సమరవిక్రమ అతని ఎడమవైపుకు వెళ్లి సాధారణ క్యాచ్ పట్టాడు. దీంతో బాబర్ ఇన్నింగ్స్ ముగిసింది. పాక్ కెప్టెన్ 16 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేశాడు.
ఐదో ఇన్నింగ్స్‌లో జయసూర్య బాబర్‌పై వేటు వేయడం ఇది నాలుగోసారి. ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఈ బౌలర్ ముందు బాబర్ కేవలం 143 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సమయంలో అతని సగటు 35.75లుగా నిలిచింది.
The GoaT The Legend The King 🤣🤣😂#Zimbabar #SLvsPAK pic.twitter.com/VBgU4wSRCS
— viratfied (@viratkohli_18_0) July 17, 2023
Babar Azam looking sad but don’t worry King you will win this and you will be man of the match – 👑💗pic.twitter.com/b7sXmgxsBG
— 𝗭𝗨𝗡𝗔𝗜𝗥𝗔🏏🇵🇰 (@BabarFanGirl56) July 17, 2023
ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న బౌలర్ జయసూర్య కాదు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త వర్ధమాన బౌలర్. గతేడాది జులై 8న ఆస్ట్రేలియాతో గాలేలోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్ కాకుండా, ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఏడు టెస్టుల్లో 50 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..