Asia Cup 2023: ప్రారంభానికి ముందే కష్టాల్లో శ్రీలంక జట్టు.. గాయాలతో నలుగురు ఔట్.. స్వ్కాడ్ ప్రకటనపై సందిగ్ధం..

Asia Cup 2023: ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్‌ను గెలుచుకున్న జట్టుగా భారత జట్టు నిలిచింది. టీమ్ ఇండియా ఏడుసార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలుచుకుంది. ఈసారి శ్రీలంక వేదికగా టోర్నీ జరుగుతున్నందున టైటిల్స్ పరంగా భారత్ రికార్డును సమం చేసేందుకు లంకకు మంచి అవకాశం లభించింది.

Asia Cup 2023: ప్రారంభానికి ముందే కష్టాల్లో శ్రీలంక జట్టు.. గాయాలతో నలుగురు ఔట్.. స్వ్కాడ్ ప్రకటనపై సందిగ్ధం..
Sri Lanka Team

Updated on: Aug 29, 2023 | 7:13 AM

Asia Cup 2023: ఆసియా కప్ 2023 ప్రారంభానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే శ్రీలంక ఇంకా ఆసియా కప్ జట్టును ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం ఆటగాళ్ల గాయం సమస్యలు. ప్రస్తుత సమాచారం ప్రకారం.. నలుగురు ముఖ్యమైన ఆటగాళ్లు ఆసియా కప్‌నకు దూరమయ్యే అవకాశం ఉంది.

ఈ జాబితాలో జట్టుకు చెందిన ప్రముఖ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా కూడా చోటు దక్కించుకున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ సందర్భంగా హసరంగ గాయపడ్డాడని, టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

భుజం గాయం కారణంగా, ప్రముఖ పేసర్ దుష్మంత చమీర ఆసియా కప్ నుంచి తప్పుకోవడం ఖాయం. అలాగే దిల్షాన్ మధుశంక కూడా ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడని, అతను కూడా టోర్నీకి దూరంగా ఉంటాడని సమాచారం.

ఈ ముగ్గురితో పాటు లహిరు కుమార్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. కాబట్టి, అతను కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. మంచి సబ్‌స్టిట్యూట్‌లు లేకపోవడంతో శ్రీలంక జట్టు ఇబ్బంది పడుతోంది. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఇప్పుడు జట్టును ప్రకటించడంలో జాప్యం చేస్తోంది.

లంక జట్టుకు భలే ఛాన్స్..

ఈ ఏడాది ఆసియా కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు లంకలోనే జరుగుతుండటంతో.. టైటిల్ గెలుచుకునే ఫేవరెట్ జాబితాలో శ్రీలంక ఉంటుంది. ఇదిలా ఉంటే నలుగురు కీలక ఆటగాళ్లు లేకపోవడం జట్టుకు ఎదురుదెబ్బే.

ఆసియా కప్‌లో భారత్‌ ఆధిపత్యం..


ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్‌ను గెలుచుకున్న జట్టుగా భారత జట్టు నిలిచింది. టీమ్ ఇండియా ఏడుసార్లు టైటిల్ గెలుచుకోగా, శ్రీలంక ఆరుసార్లు టైటిల్ గెలుచుకుంది. ఈసారి శ్రీలంక వేదికగా టోర్నీ జరుగుతున్నందున టైటిల్స్ పరంగా భారత్ రికార్డును సమం చేసేందుకు లంకకు మంచి అవకాశం లభించింది. ఇప్పటి వరకు శ్రీలంక జట్టు గాయాలతో ఆందోళన చెందుతోంది.

ఆసియా కప్ ప్రారంభం ఎప్పుడంటే..

ఆసియా కప్ బుధవారం (ఆగస్టు 30) నుంచి ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంకలో జరిగే ఈ కాంటినెంటల్ టోర్నీలో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నేపాల్‌తో తలపడనుండగా, శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అలాగే, సెప్టెంబరు 2న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఆసియా కప్ 2023 ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..