వరల్డ్‌కప్ 2019: విండీస్‌పై లంకేయుల గెలుపు

చెస్టర్‌ లీ స్ట్రేట్‌: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 338 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (104: 103 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగి… కుశాల్ పెరీరా(64: 51 బంతుల్లో 8ఫోర్లు), లాహిరు తిరిమానె (45), కుశాల్ మెండీస్(39) రాణించడంతో లంక భారీ స్కోరు […]

వరల్డ్‌కప్ 2019: విండీస్‌పై లంకేయుల గెలుపు

Updated on: Jul 02, 2019 | 12:16 AM

చెస్టర్‌ లీ స్ట్రేట్‌: ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 338 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో (104: 103 బంతుల్లో 9ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగి… కుశాల్ పెరీరా(64: 51 బంతుల్లో 8ఫోర్లు), లాహిరు తిరిమానె (45), కుశాల్ మెండీస్(39) రాణించడంతో లంక భారీ స్కోరు చేయగలిగింది. అటు విండీస్‌ బౌలర్లలో హోల్డర్ రెండు వికెట్లు తీయగా..ఫాబియన్ అలెన్, కోట్రెల్‌, థామస్‌ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 315/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. నికోలస్ పురాన్ వీరోచిత సెంచరీ(118) చేయడంతో.. విండీస్ ఓ దశలో గెలుపుకు చేరువైంది. అయితే వేగంగా పరుగులు రాబట్టే క్రమంలో అతడు చివర్లో ఔట్ కావడంతో ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. కాగా లంక బౌలర్లలో మలింగ 3 వికెట్లు.. మ్యాథ్యూస్, వండర్‌సేలకు తలో వికెట్ దక్కింది.