Asia Cup 2023 Latest Update: ఆసియా కప్ 2023 ఆతిథ్యం ప్రస్తుతం సందిగ్ధంలో పడింది. అయితే దీనిపై త్వరలో ఓ కీలక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. బీసీసీఐ గతంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను తిరస్కరించింది. ఇప్పుడు ఆసియా కప్ 2023 ఆతిథ్యాన్ని పాకిస్థాన్ నుంచి లాక్కోవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో, శ్రీలంక ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీలంక క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌ను సూచించింది. ఈ హైబ్రిడ్ మోడల్ ప్రకారం, పాకిస్తాన్ ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వవొచ్చని తెలుస్తోంది. అయితే భారత క్రికెట్ జట్టు తటస్థ వేదికలో ఆడొచ్చని పేర్కొంది. అంటే, బంగ్లాదేశ్, శ్రీలంక, దుబాయ్ లేదా పాకిస్తాన్‌కు బదులుగా ఏదైనా తటస్థ వేదికలో తన మ్యాచ్‌లను ఆడటానికి భారతదేశానికి అవకాశం ఉంది. అయితే BCCI పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సూచనను తిరస్కరించింది. ఇప్పుడు ఆసియా కప్ 2023 శ్రీలంకలో నిర్వహించవచ్చని వార్తలు వస్తున్నాయి. దీనితో పాటు త్వరలో భారీ ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మొదటి ప్రతిపాదన: ఆసియా కప్ టోర్నమెంట్ పాకిస్థాన్‌లో నిర్వహించాలి. అయితే భారత జట్టు తటస్థ వేదికలో పాక్‌తో ఆడొచ్చు.
రెండవ ప్రతిపాదన: ఆసియా కప్ టోర్నీని రెండు భాగాలుగా విభజించనున్నారు. తొలి రౌండ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఈ రౌండ్‌లో భారత్‌తో మ్యాచ్‌లు ఉండవు. నిజానికి రెండో రౌండ్‌లో ఆయా టీంలతో భారత జట్టు ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ మ్యాచ్ తటస్థ వేదికపై జరుగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..