Asia Cup 2023: ఆసియా కప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు ఔట్.. డిఫెండింగ్ చాంపియన్ మళ్లీ టైటిల్ గెలిచేనా..?

|

Aug 29, 2023 | 7:09 PM

Sri Lanka Team: 15 మందితో కూడిన శ్రీలంక జట్టుకు దసున్ షనక నాయకత్వం వహించనుండగా, వైస్ కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ కనిపించనున్నాడు. అలాగే ఆసియా కప్ కోసం ఎంపికైన శ్రీలంక జట్టులో మహేశ్‌ తీక్షణ, మతిష్‌ పతిరాణా, చరిత్‌ అసలంక, పాతుమ్‌ నిశాంక, ధనంజయ డి సిల్వా, బినూర ఫెర్నాండో, ప్రమోద్ మధుషన్ వంటి స్టార్‌ ప్లేయర్లకు అవకాశం లభించింది. అయితే టోర్నీ కోసం వనిందు హసరంగా, దుష్మంత చమేరా..

Asia Cup 2023: ఆసియా కప్‌కు శ్రీలంక జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు ఔట్.. డిఫెండింగ్ చాంపియన్ మళ్లీ టైటిల్ గెలిచేనా..?
Sri Lanka Team
Follow us on

Asia Cup 2023: ప్రతిష్టాత్మక ఆసియా కప్ కోసం డిఫెండింగ్ చాంపియన్స్ శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన శ్రీలంక జట్టుకు దసున్ షనక నాయకత్వం వహించనుండగా, వైస్ కెప్టెన్‌గా కుశాల్ మెండిస్ కనిపించనున్నాడు. అలాగే ఆసియా కప్ కోసం ఎంపికైన శ్రీలంక జట్టులో మహేశ్‌ తీక్షణ, మతిష్‌ పతిరాణా, చరిత్‌ అసలంక, పాతుమ్‌ నిశాంక, ధనంజయ డి సిల్వా, బినూర ఫెర్నాండో, ప్రమోద్ మధుషన్ వంటి స్టార్‌ ప్లేయర్లకు అవకాశం లభించింది.

అయితే టోర్నీ కోసం వనిందు హసరంగా, దుష్మంత చమేరా, దిల్షాన్ మధుశంక, లహిరు కుమార్‌ వంటి ఆటగాళ్లకు అవకాశం లభించలేదు. ఈ నలుగురు ఆటగాళ్లు గాయం కారణంగా ఆటకు దూరంగా ఉండడంతో వీరిని శ్రీలంక జట్టు ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి

లంకేయుల జట్టు.. 

ఇంకా ఒక్క రోజే..

కాగా, శ్రీలంక జట్టు తమ తొలి మ్యాచ్‌ని సెప్టెంబర్ 31న బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

బంగ్లాతో తొలి పోరు..

గెలుపును రిపీట్ చేస్తారా..? 

రెండు దేశాల్లో ఆసియా కప్:

ఆసియా కప్ 2023 టోర్నమెంట్ పాకిస్థాన్‌, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌లోనే జరగాల్సి ఉన్నా.. ఆ దేశానికి భారత జట్టు వెళ్లేందుకు నిర్వహించడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ శ్రీలంకలో కూడా టోర్నీ మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్థాన్‌లో 4 మ్యాచ్‌లు.. ఆసియా కప్ ఫైనల్‌తో సహా మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి.

ఆసియా కప్‌కు శ్రీలంక జట్టు: దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ పెరీరా, కుసాల్ మెండిస్(వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, , సదీర సమరవిక్రమ, మహిష్ తీక్షణ్, దునిత్ వెల్లాలఘే, మతిశౌన్ పతిర రజిత, దుషన్ హేమంత, బినూర ఫెర్నాండో, ప్రమోద్ మధుషన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..