Kaviya Maran: దుబాయ్‌లో సోమవారం రాత్రి హైదరాబాద్ టీం విజంయ సాధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ టీం విధించిన 165 పరుగుల టార్గెట్‌ను కేవలం మూడు వికెట్లు కోల్పోయి, మరో 9 బంతులు ఉండగానే విజయం సాధించింది. దీంతో మిస్టరీ గర్ల్ కావ్య మారన్ ముఖంలో ఎట్టకేలకు చిరునవ్వు కనిపించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు హైదరాబాద్ జట్టుకు సభ్యులను పొగడ్తలతో ముంచెత్తారు. ఇన్ని రోజులు హైదరాబాద్ టీం ఓడిపోతూ వస్తోంది. దాంతో టీం యజమాని కళానిధి మారన్ కుమార్తె ముఖంలో ఆనందం కరవయ్యేది. టీంను ఉత్సాహపరిచేందుకు మైదానంలోకి వచ్చినా.. టీం మాత్రం పేలవ ప్రదర్శనతో ఓటమిపాలై.. తనను నిరాశపరిచేది.
సోమవారం (సెప్టెంబర్ 27) జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించడం నిజంగా అద్భుతం. చాలా కాలం తరువాత హైదరాబాద్ టీం.. అద్భుత ప్రదర్శన చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ ‘మిస్టరీ గర్ల్’ కోసం ఎట్టకేలకు ఓ విజయాన్ని అందించింది.
సోమవారం రాత్రి దుబాయ్‌లో కావ్య ముఖంలో చిరునవ్వు కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఎంతో ఆనందించారు. ప్రస్తుతం పట్టికలో అట్టడుగున ఉన్న ఎస్‌ఆర్‌హెచ్‌కి ఇది సీజన్‌లో రెండవ విజయంగా నమోదైంది.
“చాలా రోజుల తర్వాత కావ్య మారన్ ముఖంలో నవ్వు చూశాం. మ్యాచ్ గెలిచినందుకు ఎస్‌ఆర్‌హెచ్ టీంకి ధన్యవాదాలు ”అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు.
“ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్ గెలిచింది. ఎందుకంటే కెమెరామెన్ కెమెరాను కావ్య మారన్ కంటే మ్యాచ్‌పైనే ఎక్కువగా ఫోకస్ చేశాడని” మరొక అభిమాని సరదాగా కామెంట్ చేశాడు.
“ఎట్టకేలకు కావ్య మారన్ నవ్వుతూ సంబరాలు చేసుకోవడం చూశాను! ” అని మరొకరు ట్వీట్ చేశారు.
కావ్య తన బృందానికి చాలా మద్దతుదారుగా ఉంటోంది. భారతదేశంలో, విదేశాలలో జరిగిన ఐపీఎల్ ఎన్‌కౌంటర్లలో ఆటగాళ్లను ఉత్సాహ పరిచేందుకు మైదానంలో అప్పుడప్పుడూ కనిపిస్తూ సందడి చేస్తోంది. 29 ఏళ్ల కావ్య ఫ్రాంచైజీకి సహ యజమానిగా ఉంది. సన్ టీవీ యాజమాన్యంలోని సన్ మ్యూజిక్, ఎఫ్ఎం ఛానెల్‌లను తనే చూసుకుంటోంది.
అయితే, ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన సన్‌రైజర్స్ టీం కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా కోల్పోయింది.
Finally seen Kaviya maran smiling after so long ????
Thanks #SRH for winning the game ❤️#KaviyaMaran#IPL2O21 pic.twitter.com/UbCi5wBnCF
— Ganesh (@ganesh_chunduru) September 27, 2021
KKR vs DC Live Score, IPL 2021: 10 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 64/2.. స్మిత్ 31, పంత్ 7 పరుగులతో బ్యాటింగ్