MI Predicted Playing XI: ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోతే..

MI Predicted Playing XI: హ్యాట్రిక్ విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ (Mumbai Indians Playing XI) మరోసారి విజయాల ట్రాక్‌లోకి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత హార్దిక్ సేన ఈ సీజన్‌లో బలమైన పునరాగమనం చేసింది.

MI Predicted Playing XI: ముంబై మ్యాచ్ విన్నర్ రీఎంట్రీ.. ఉప్పల్‌ స్టేడియంలో ఊచకోతే..
Mi Predicted Playing Xi Vs Srh

Updated on: Apr 23, 2025 | 9:56 AM

MI Predicted Playing XI: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడటం ద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చే సంకేతాలను చూపించాడు. మరోవైపు, ముంబై స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ కూడా నిలకడగా రాణిస్తున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సూర్య కేవలం 30 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ల తదుపరి లక్ష్యం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తుఫాన్ బ్యాటింగ్ చేయడమే. అదే సమయంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ కోసం తన ప్రాబబుల్ ప్లేయింగ్ XI (MI Predicted Playing XI)పై ఫోకస్ చేశాడు.

ఓపెనింగ్ జోడీపైనే అందరి చూపు..

బ్లూ ఆర్మీకి బలమైన ఓపెనింగ్ ఇచ్చే బాధ్యత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మన్ రియాన్ రికెల్టన్ పై ఉంటుంది. గత మ్యాచ్‌లో ఎల్లో ఆర్మీపై వీరిద్దరూ 40 బంతుల్లో 63 పరుగుల బలమైన ఆరంభాన్ని అందించారు. దీంతో ముంబై జట్టు 177 పరుగుల లక్ష్యాన్ని సులభంగా ఛేదించగలిగింది. అదే సమయంలో, ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఇద్దరు ఓపెనర్లు సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైనా ఇలాంటి బలమైన ఓపెనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు.

ఇది కూడా చదవండి: ఒరేయ్, ఎవర్రా నువ్వు.. టీ20ల్లో చెత్త బ్యాటింగ్.. ఓపెనర్‌గా వచ్చి నాటౌట్‌గా నిలిచి.. ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

ఇవి కూడా చదవండి

బలపడిన మిడిల్ ఆర్డర్..

రోహిత్ శర్మ తిరిగి ఫాంలోకి వచ్చిన తర్వాత ముంబై ఇండియన్స్ (MI Predicted Playing XI) టాప్ ఆర్డర్ మునుపటి కంటే ప్రమాదకరంగా కనిపిస్తున్నప్పటికీ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మల దూకుడు విధానం ఈ జట్టును మునుపటి కంటే మరింత డేంజరస్‌‌గా మార్చింది. టాప్ ఆర్డర్‌లో రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ తర్వాత, మూడో స్థానంలో సూర్య, నాలుగో స్థానంలో తిలక్ వర్మ జట్టుకు చాలా వేగంగా పరుగులు సాధిస్తుండగా, 5, 6 స్థానాల్లో విల్ జాక్స్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా వేగంగా పరుగులు సాధిస్తూ జట్టు విజయానికి దోహదపడుతున్నారు. ఏడో స్థానంలో, నమన్ త్వరగా పరుగులు సాధించడమే కాకుండా జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తాడు.

బౌలర్ల అద్భుతాలు..

ముంబై ఇండియన్స్ (MI Predicted Playing XI) బ్యాటింగ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, వారి బౌలింగ్ కూడా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతోంది. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ కొత్త బంతితో తమ పాత్రలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మిడిల్ ఓవర్ల నుంచి డెత్ ఓవర్ల వరకు, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్థి బ్యాటర్లకు ప్రతి పరుగు కోసం కష్టపడేలా చేస్తున్నారు. మిడిల్ ఓవర్లలో, కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్వయంగా పరుగులను నియంత్రించే బాధ్యతను తీసుకుంటాడు. స్పిన్ విభాగాన్ని అనుభవజ్ఞులైన మిచెల్ సాంట్నర్, కర్ణ్ శర్మ, విల్ జాక్స్‌లు నిర్వహిస్తున్నారు. కర్ణ్ శర్మ చివరి మ్యాచ్ ఆడలేదు. కానీ, ఈ మ్యాచ్‌లో అతను తిరిగి రావడం సాధ్యమేనని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Video: ఇదేం బౌలింగ్ భయ్యా.. అర్థమయ్యేలోపే క్లీన్ బౌల్ట్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ముంబై ఇండియన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ ప్లేయర్: – కర్ణ్ శర్మ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..