Sunrisers Hyderabad vs Mumbai Indians Live Score in Telugu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2 వికెట్లు తీశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లీగ్ దశలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఈ సీజన్‌ని సరిగ్గా ప్రారంభించలేదు. తన తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో, రెండో మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత ఢిల్లీ, కోల్ కతాలను ఓడించింది. ముంబైకి ఇది ఐదో మ్యాచ్.
హైదరాబాద్ మునుపటి రెండు మ్యాచ్‌లను గెలిచింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలను పూర్తి చేయాలని చూస్తోంది. ఆ జట్టు వరుసగా రెండు పరాజయాలతో టోర్నీని ప్రారంభించింది.
ఇరుజట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్.
హైదరాబాద్ ను ఓడించిన ముంబై .. ఆల్ అవుట్ అయిన సన్ రైజర్స్
ఎనిమిదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్.. స్కోర్ 180/8
వరుస వికెట్లు కోల్పోతోన్న హైదరాబాద్.. ఏడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్ స్కోర్ 149/7
మరో వికెట్ కోల్పోయిన హైదరాబాద్.. ఆరో వికెట్ కోల్పోయిన సన్ రైజర్స్
ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్. పీయూష్ చావ్లా వేసిన 14 ఓవర్‌లో క్లాసెన్ (36; 16 బంతుల్లో) వరుసగా 4,6,6,4 బాదాడు. చివరి బంతికి టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు
నాలుగో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్ ..
మూడో వికెట్ కోల్పోయిన హైదరాబాద్ సన్ రైజర్స్.. మార్‌క్రమ్ (22) ఔటయ్యాడు. కామెరూన్ వేసిన 8.4వ బంతికి భారీ షాట్ ఆడి బౌండరీ వద్ద హృతిక్ షోకీన్ చేతికి చిక్కిపోయాడు.
రెండో వికెట్ కోల్పోయిన హైదరాబాద్. బెహ్రన్‌డార్ఫ్ వేసిన 3.4 ఓవర్‌కు రాహుల్ త్రిపాఠి (7) ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు
రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు.
హైదరాబాద్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2 వికెట్లు తీశాడు.
17 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 3 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 38, తిలక్ వర్మ 37, సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 28 పరుగుల వద్ద నటరాజన్‌కు బలయ్యాడు.
13 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 3 వికెట్లకు 109 పరుగులు చేసింది.
10 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది.
7 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఒక వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 28 పరుగుల వద్ద నటరాజన్‌కు బలయ్యాడు.
హైదరాబాద్ వేదికగా హోమ్ టీమ్‌పై ఆడుతున్న ముంబై ఇండియన్స్ తమ తొలి వికెట్‌ని కోల్పోయింది. 5వ ఓవర్ వేసిన నటరాజన్ బౌలింగ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ క్యాచ్‌ఔట్ అయ్యాడు. ముంబై కెప్టెన్ ఆడిన షాట్‌ని హైదరాబాద్ టీమ్ సారథి మార్క్రమ్ క్యాచ్ పట్టాడు. ఇక 18 బంతులు ఆడిన రోహిత్ 6 ఫోర్లతో సహా మొత్తం 28 పరుగులు చేశాడు.
రెండో ఓవర్ చివరి బంతిని ఇషాన్ కిషన్ సిక్సర్‌గా బాదడంతో మూడో ఓవర్ మొదటి బంతిని ఆడేందుకు రోహిత్ శర్మ క్రీజులోకి వచ్చాడు. సన్‌రైజర్స్ తరఫున మూడో ఓవర్ వేయడానికి వచ్చిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ మొదటి మూడు బంతులను ఫోర్లుగా కొట్టాడు హిట్‌మ్యాన్. ఇలా హ్యాట్రిక్ బౌండరీలతో పరుగుల వరద కురిపిస్తున్నాడు రోహిత్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(సి), హెన్రిచ్ క్లాసెన్(w), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్.
కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ టీం టాస్ గెలిచి, తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై టీం బ్యాటింగ్ చేయనుంది.
ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండు జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా జరగనుంది. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటి వరకు 19 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 10 మ్యాచ్‌లు, హైదరాబాద్ 9 మ్యాచ్‌లు గెలిచాయి.
నేడు ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో తలపడేందుకు ముంబై టీం సిద్ధమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ చేరుకున్న ముంబై ఆటగాళ్లు.. యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేశారు.
FA??LY moment at the Varma house ?#OneFamily #MumbaiIndians @TilakV9 pic.twitter.com/IYyIhrHEgN
— Mumbai Indians (@mipaltan) April 17, 2023
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో నేడు లీగ్ దశలో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.