SRH vs MI, IPL 2024: హైదరాబాద్‌తో మ్యాచ్.. ఉప్పల్‌లో డబుల్ సెంచరీ కొట్టనున్న రోహిత్ శర్మ

|

Mar 27, 2024 | 6:53 PM

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 27న) అంటే మరికాసేపట్లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం కానుంది. నేటి మ్యాచ్‌లో రోహిత్ మైదానంలోకి రాగానే..

SRH vs MI, IPL 2024: హైదరాబాద్‌తో మ్యాచ్.. ఉప్పల్‌లో డబుల్ సెంచరీ కొట్టనున్న రోహిత్ శర్మ
Rohit Sharma
Follow us on

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. గురువారం (మార్చి 27న) అంటే మరికాసేపట్లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం కానుంది. నేటి మ్యాచ్‌లో రోహిత్ మైదానంలోకి రాగానే.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున 200వ మ్యాచ్ ఆడిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ముంబై తరఫున రోహిత్ మినహా మరే ఆటగాడు ఈ ఘనత సాధించలేకపోయాడు.రోహిత్ శర్మ 2011 నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ జట్టు తరఫున 199 మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో 200వ మ్యాచ్ ఆడనున్నాడు. ఇక్కడ విశేషమేమిటంటే ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఏ ఆటగాడు కూడా ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అరుదైన రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్‌ నిలవనున్నాడు.

రోహిత్ తర్వాత ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ ఉన్నాడు. అతను మొత్తం 189 మ్యాచ్‌లు ఆడాడు. ఆతర్వాత ముంబై తరఫున హర్భజన్ సింగ్ 136 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉండగా, లసిత్ మలింగ 122 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 121 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున 199 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 29.38 సగటుతో 5084 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2013 నుంచి 2023 వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టుకు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.

ఇవి కూడా చదవండి

రోహిత్ కు స్పెషల్ జెర్సీ అందించిన సచిన్ టెండూల్కర్..

సచిన్ తో రోహిత్..

ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా)

రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పీయూష్ చావ్లా, జెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..