SRH vs LSG, IPL 2026 Highlights: పంత్ కిరాక్ ఇన్నింగ్స్.. సొంత గ్రౌండ్‌లో హైదరాబాద్ ఘోర పరాజయం..

SRH vs LSG, IPL 2026 Highlights: ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇదే తొలి విజయం కాగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

SRH vs LSG, IPL 2026 Highlights: పంత్ కిరాక్ ఇన్నింగ్స్.. సొంత గ్రౌండ్‌లో హైదరాబాద్ ఘోర పరాజయం..
Srh Vs Lsg Result

Updated on: Apr 05, 2026 | 7:22 PM

SRH vs LSG, IPL 2026 Highlights: ఐపీఎల్ 10వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ఆ జట్టుకు ఇదే తొలి విజయం కాగా, హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.

హైదరాబాద్ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ స్టేడియంలో లక్నో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్నో 19.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది.

SRH తరఫున హెన్రిచ్ క్లాసెన్ (62) మరియు నితీష్ కుమార్ రెడ్డి (56) అర్ధ సెంచరీలు సాధించారు. వీరు ఐదవ వికెట్ కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లక్నో తరఫున మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మరియు ఆవేశ్ ఖాన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. దిగ్వేష్ రాఠీ మరియు మణిమారన్ సిద్ధార్థ్ చెరో వికెట్ తీశారు. రిషబ్ పంత్ బౌలింగ్ లో హర్షల్ పటేల్ రనౌట్ అయ్యాడు.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎషాన్ మలింగ, సలీల్ అరోరా, డేవిడ్ పేన్, శివమ్ మావి, జీషన్ అన్సారీ.

లక్నో సూపర్ జెయింట్స్: ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, ఆన్రిచ్ నార్ట్జే, హిమ్మత్ సింగ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 05 Apr 2026 07:13 PM (IST)

    SRH vs LSG: లక్నో ఘన విజయం..

    హైదరాబాద్ టీం 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లక్నోతో జరిగిన ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోర్‌ను కాపాడుకోవడంలో విఫలమైంది. లక్నో తరపున పంత్ హాఫ్ సెంచరీ కీలక ఇన్నింగ్స్ ఆడి SRH జట్లును ఓడించాడు.

  • 05 Apr 2026 06:49 PM (IST)

    15 ఓవర్లకు..

    లక్నో 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. రిషబ్ పంత్ క్రీజులో ఉన్నాడు.

  • 05 Apr 2026 06:35 PM (IST)

    తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన శివంక్

    శివాంగ్ కుమార్ ఐడెన్ మార్క్రమ్‌ను అవుట్ చేసి ఒక కీలకమైన వికెట్ తీశాడు. మార్క్రమ్ నేరుగా షాట్ ఆడటానికి ప్రయత్నించగా, బంతి అతని బ్యాట్ బయటి అంచుకు తగిలి గాలిలోకి లేచింది. లాంగ్-ఆఫ్‌లో ఉన్న లియామ్ లివింగ్‌స్టోన్ సులభమైన క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్‌లో శివాంగ్ కుమార్‌కు ఇదే తొలి వికెట్.

  • 05 Apr 2026 06:13 PM (IST)

    SRH vs LSG: 8 ఓవర్లకు..

    9 ఓవర్ల తర్వాత లక్నో 1 వికెట్ నష్టానికి 76 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ క్రీజులో ఉన్నారు. మిచెల్ మార్ష్ అవుటయ్యాడు.

  • 05 Apr 2026 05:56 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే

    పవర్ ప్లే ముగిసే సరికి లక్నో జట్టు 1 వికెట్ కోల్పోయి 53 పరుగులు చేసింది. మార్క్రమ్ 37 పరుగులు, పంత్ 1 పరుగుతో క్రీజులో నిలిచారు.

  • 05 Apr 2026 05:45 PM (IST)

    4 ఓవర్లకు లక్నో..

    4 ఓవర్ల తర్వాత లక్నో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఐడెన్ మార్క్రమ్ 23, మిచెల్ మార్ష్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 05 Apr 2026 05:18 PM (IST)

    SRH vs LSG: లక్నో టార్గెట్ 157

    సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. క్లాసెన్, నితీష్ 116 పరుగుల భాగస్వామ్యంతో హైదరాబాద్ జట్టుకు పోరాడే స్కోర్ అందించారు.

  • 05 Apr 2026 05:03 PM (IST)

    SRH vs LSG: తెలుగబ్బాయ్ ఔట్..

    నితీష్ కుమార్ రెడ్డి హాఫ్ సెంచరీ తర్వాత ఊహించని విధంగా పెవిలియన్ చేరాడు. దీంతో హైదరాబాద్ జట్టు 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది.

  • 05 Apr 2026 04:55 PM (IST)

    నితీష్ కుమార్ హాఫ్ సెంచరీ..

    నితీష్ కుమార్ రెడ్డి 30 బంతుల్లో 4 సిక్స్ లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు క్లాసెన్ కూడా 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేయడంతో ఇద్దరి మధ్య 53 బంతుల్లో 98 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.

  • 05 Apr 2026 04:52 PM (IST)

    SRH vs LSG: క్లాసెన్ హాఫ్ సెంచరీ..

    4 వికెట్లు తర్వగా పడిపోయి కష్టాల్లో పడిన హైదరాబాద్ జట్టుకు క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి అండగా నిలిచారు. ఈ క్రమంలో క్లాసెన్ 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

  • 05 Apr 2026 04:34 PM (IST)

    SRH vs LSG, IPL 2026: 13 ఓవర్లకు..

    13 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. ప్రస్తుతం క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు.

  • 05 Apr 2026 04:12 PM (IST)

    4వ వికెట్ డౌన్..

    8 ఓవర్ల తర్వాత హైదరాబాద్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి క్రీజులో ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, లియామ్ లివింగ్‌స్టోన్ అవుటయ్యారు. మహమ్మద్ షమీ ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేశాడు.

  • 05 Apr 2026 03:51 PM (IST)

    SRH vs LSG: 3వ వికెడ్ డౌన్

    లక్నో బౌలర్ల దెబ్బకు హైదరాబాద్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. ఇషాన్ (1) మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో 4 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది.

  • 05 Apr 2026 03:45 PM (IST)

    రెండు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్..

    టాస్ ఓడి బ్యాటింగ్ మొదలుపెట్టిన హైదరాబాద్ జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి. అభిషేక్ శర్మ డకౌట్ కాగా, ట్రావిస్ హెడ్ 7 పరుగులకు పెవిలియన్ చేరడంతో కష్టాల్లో కూరకపోయింది.

  • 05 Apr 2026 03:23 PM (IST)

    ఇంపాక్ట్ ప్లేయర్లు:

    సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎషాన్ మలింగ, సలీల్ అరోరా, డేవిడ్ పేన్, శివమ్ మావి, జీషన్ అన్సారీ.

    లక్నో సూపర్ జెయింట్స్: ఆయుష్ బడోని, మాథ్యూ బ్రీట్జ్కే, షాబాజ్ అహ్మద్, ఆన్రిచ్ నార్ట్జే, హిమ్మత్ సింగ్

  • 05 Apr 2026 03:22 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:

    ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్

  • 05 Apr 2026 03:21 PM (IST)

    లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ XI

    మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.

  • 05 Apr 2026 03:19 PM (IST)

    SRH vs LSG: టాస్ గెలిచిన లక్నో..

    టాస్ గెలిచిన లక్నో ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

  • 05 Apr 2026 02:50 PM (IST)

    పిచ్ నివేదిక

    రాజీవ్ గాంధీ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఉపరితలం చదునుగా ఉండటం వల్ల షాట్లు ఆడటం సులభం అవుతుంది. తద్వారా అధిక స్కోర్లు చేయడానికి వీలవుతుంది. మ్యాచ్ సాగేకొద్దీ పిచ్ నెమ్మదిస్తుంది. ఇది స్పిన్నర్లకు అనుకూలించేలా చేస్తుంది. ఈ మైదానం ఇప్పటివరకు 83 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.

  • 05 Apr 2026 01:52 PM (IST)

    LSG ప్లేయింగ్ XI (అంచనా)

    మిచెల్ మార్ష్, ఐడెన్ మర్క్రమ్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే, మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, మొహ్సిన్ ఖాన్

  • 05 Apr 2026 01:52 PM (IST)

    SRH ప్లేయింగ్ XI (అంచనా)

    ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ

  • 05 Apr 2026 01:15 PM (IST)

    హెడ్-టు-హెడ్.. లక్నోదే పైచేయి

    చరిత్రను చూస్తే సన్‌రైజర్స్‌పై లక్నోకు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు జరిగిన 6 మ్యాచుల్లో లక్నో 4 సార్లు గెలిచింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన 3 మ్యాచుల్లోనూ లక్నో రెండుసార్లు గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అయితే, గత మూడు మ్యాచుల్లో రెండుసార్లు ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించి గట్టి పోటీనిస్తోంది. నేడు మొహమ్మద్ షమీ వర్సెస్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగే పోరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలవనుంది.

  • 05 Apr 2026 01:15 PM (IST)

    ఉప్పల్ పిచ్ రిపోర్ట్.. టాస్ గెలిస్తే బౌలింగే

    హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ బౌన్స్ స్థిరంగా ఉండటంతో బ్యాటర్లు సులభంగా షాట్లు ఆడగలరు. ఇది మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి డ్యూ ప్రభావం ఉండదు. కానీ, ఈ గ్రౌండ్‌లో ఛేజింగ్ చేసే జట్లకే ఎక్కువ విజయాలు (56.63%) దక్కాయి. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 200 దాటే అవకాశం ఉంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

Follow Us