IPL 2026: తండ్రి మాటతో రూటు మార్చిన కావ్యపాప బ్రహ్మస్త్రం.. ఎవర్రా ఈ SRH కొత్త కుర్రాడు..

SRH Debutant Shivang Kumar: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ శివాంగ్ కుమార్‌ను తుది జట్టులోకి తీసుకుని ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. కేవలం రూ. 30 లక్షలకే దక్కిన ఈ కుర్రాడు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

IPL 2026: తండ్రి మాటతో రూటు మార్చిన కావ్యపాప బ్రహ్మస్త్రం.. ఎవర్రా ఈ SRH కొత్త కుర్రాడు..
Srh Vs Kkr Shivang Kumar

Updated on: Apr 02, 2026 | 8:49 PM

SRH Debutant Shivang Kumar: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌(IPL 2026)లో భాగంగా గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల శివాంగ్ కుమార్ ప్రతిష్టాత్మకమైన ఐపీఎల్ బరిలోకి దిగాడు. గత వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం ఈ యువ ఆల్ రౌండర్‌ను అతని కనీస ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన శివాంగ్, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద లీగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

అత్యల్ప మ్యాచ్‌ల్లోనే అద్భుత ప్రతిభ..

శివాంగ్ కుమార్ కెరీర్ గణాంకాలను పరిశీలిస్తే, అతను ఇప్పటివరకు దేశవాళీ క్రికెట్‌లో కేవలం ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో నాలుగు టీ20లు, మూడు లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఉన్నాయి. తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ, తనేంటో నిరూపించుకోవడంలో శివాంగ్ సఫలమయ్యాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక వంటి బలమైన జట్టుపై 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలాగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్‌పై 25 పరుగులకే 3 వికెట్లు తీసి తన బౌలింగ్ పదును చూపించాడు.

బ్యాటింగ్‌లోనూ సత్తా..

శివాంగ్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, అవసరమైనప్పుడు బ్యాట్‌తోనూ రాణించగల సత్తా ఉన్న ఆటగాడు. 2025-26 విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ జట్టుపై కేవలం 69 బంతుల్లోనే 67 పరుగులు చేసి తనలోని బ్యాటింగ్ నైపుణ్యాన్ని బయటపెట్టాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్టులో ఇలాంటి యువ ఆల్ రౌండర్ ఉండటం జట్టు సమతూకానికి ఎంతో కీలకం కానుంది. లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించడంలో శివాంగ్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

తండ్రి సలహాతో మారిన కెరీర్..

మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతానికి చెందిన శివాంగ్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. రైల్వే శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న తన తండ్రి పర్యవేక్షణలోనే శివాంగ్ క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శివాంగ్ మొదట కుడిచేతి వాటం బౌలర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అయితే, తన తండ్రి ఇచ్చిన సలహా మేరకు ఎడమచేతి వాటం రిస్ట్ స్పిన్నర్‌గా మారాడు. నేడు అదే శైలి అతనికి ఐపీఎల్ వంటి పెద్ద వేదికపై అవకాశం కల్పించింది. ఒక లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ లభించడం ఏ జట్టుకైనా అదనపు బలమే. మరి ఈ సీజన్‌లో శివాంగ్ తన స్పిన్ మాయాజాలంతో ఎన్ని వికెట్లు తీస్తాడో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us