IPL: ‘ఐపీఎల్‌లో కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు’.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్లేయర్..
ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఈ క్రీడపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఐపీఎల్ ద్వారా క్రికెటర్లు ఆటపై కన్నా ఆటగాళ్లు కమర్షియల్‌గా మారిపోతున్నారంటూ వాదనలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా...
Steyn Comments On IPL: క్రికెట్ అభిమానులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేస్తూ వచ్చిందే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). బంతి బంతికి ఉత్కంఠ, బౌండరీల మోత, క్షణాల్లో మ్యాచ్ తలకిందులు కావడం ఇలా మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందిస్తుంది. అయితే ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఈ క్రీడపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఐపీఎల్ ద్వారా క్రికెటర్లు ఆటపై కన్నా ఆటగాళ్లు కమర్షియల్‌గా మారిపోతున్నారంటూ వాదనలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ ఐపీఎల్‌పై ఇలాంటి సంచలన వ్యాఖ్యలే చేశారు. ప్రస్తుతం స్టెయిన్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఐపీఎల్‌లో కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని, అక్కడ ఆట తెర వెనక్కి వెళ్లిపోతుందని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతోన్న ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టెయిన్ ప్రస్తుతం.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలో స్టెయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ విషయమై స్టెయిన్ మాట్లాడుతూ.. ఐపీఎల్ ఎప్పుడు భారీ జట్లు, ఎవరికెంత ఇస్తారు అన్న దానిపైనే చర్చ జరుగుతుంది. క్రికెట్‌కు ప్రాధాన్యత తగ్గిపోతుందని తెలిపాడు. అందుకే ఒక ఆటగాడిగా తాను ఐపీఎల్‌తో పోలిస్తే.. పీసీఎల్, లంక లీగ్‌లోనే ఆడటం ఎక్కువ సంతృప్తినిస్తుందని చెప్పుకొచ్చాడు. ‘పీఎస్‌ఎల్ కోసం ఇక్కడికి వచ్చిన నన్ను కలిసిన వారంతా కేవలం క్రికెట్ గురించే మాట్లాడారు.. అదే ఐపీఎల్‌లో మాత్రం నీకు ఎంత మొత్తం వస్తోంది అనే విషయాలే మాట్లాడుతారు’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇక స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం తీవ్ర దుమారమే రేగుతోంది. ఐపీఎల్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజెన్లు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ‘అత్యున్నత స్థాయిలో పడలేకపోతే ఇలానే విమర్శిస్తుంటారు’ అంటూ కొందరు స్టెయిన్‌కు చురకలు అంటిస్తున్నారు. ఇక మరికొందరు ‘నువ్వు ఐపీఎల్ ఆడినప్పుడు ఇవన్నీ మర్చిపోయావా’ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. మరి స్టెయిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు బీసీసీఐ కానీ ఐపీఎల్ కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.