- Telugu News Sports News Cricket news South africa young player matthew breetzke world record in just 5 innings in odi cricket
ODI Records: ఎవడ్రా ఈ తోపు.. తొలి 5 వన్డేల్లోనే రికార్డుల రారాజుగా.. ఇలాంటోడు మరొకడు లేడు భయ్యా..
World Record in ODI Cricket: వన్డే క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని బ్రేక్ అవుతుంటాయి. మరికొన్ని మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంటాయి. అయితే, అరంగేట్రం చేసినప్పటి నుంచి మొదటి ఐదు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఓ బ్యాట్స్‌మన్ రికార్డుల వర్షం కురిపించాడు. ఆయనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 07, 2025 | 1:25 PM

World Record in ODI Cricket: దక్షిణాఫ్రికా డాషింగ్ యువ బ్యాట్స్‌మన్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డే క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. మాథ్యూ బ్రీట్జ్కే తన కెరీర్‌లోని మొదటి ఐదు వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు అతని పేరు మీద ప్రపంచ రికార్డు నమోదైంది.

వన్డే క్రికెట్ చరిత్రలో అరంగేట్రం చేసినప్పటి నుంచి మొదటి ఐదు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా మాథ్యూ బ్రీట్జ్కే నిలిచాడు. ఇది మాత్రమే కాదు, తన కెరీర్‌లోని మొదటి ఐదు వన్డేల్లో ఐదుసార్లు యాభై ప్లస్ పరుగులు చేసిన ప్రపంచ రికార్డు కూడా అతని సొంతం.

వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి మాథ్యూ బ్రీట్జ్కే మొదటి ఐదు మ్యాచ్‌ల్లో 463 పరుగులు చేశాడు. ఈ విషయంలో అతను టామ్ కూపర్‌ను అధిగమించాడు. అదే సమయంలో అతను తన సొంత దేశ కెప్టెన్ టెంబా బావుమాను కూడా అధిగమించాడు.

ఈ జాబితాలో మరో దక్షిణాఫ్రికా క్రికెటర్ అల్లన్ లాంబ్ పేరు మూడో స్థానంలో ఉంది. అలన్ లాంబ్ తన కెరీర్‌లోని మొదటి ఐదు వన్డేల్లో 328 పరుగులు చేశాడు. 122 వన్డేల్లో 4010 పరుగులు చేశాడు.

అలెన్ తర్వాత, దక్షిణాఫ్రికా ప్రస్తుత వన్డే కెప్టెన్ టెంబా బావుమా పేరు తర్వాత వస్తుంది. బావుమా తన కెరీర్‌లోని మొదటి ఐదు వన్డేల్లో 309 పరుగులు చేయడం ద్వారా గొప్ప ఆరంభం పొందాడు. ఇప్పుడు అతను జట్టుకు కెప్టెన్ కూడా.

ఈ జాబితాలో ఫిల్ సాల్ట్ పేరు ఐదవ స్థానంలో ఉంది. ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ తరపున అద్భుతమైన వన్డే అరంగేట్రం చేసి మొదటి ఐదు వన్డేల్లో 303 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ తరపున 33 వన్డేల్లో సాల్ట్ 988 పరుగులు చేశాడు. నెదర్లాండ్స్‌కు చెందిన టామ్ కూపర్ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి మొదటి ఐదు మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు, 374 పరుగులు చేశాడు. ఇప్పుడు మాథ్యూ బ్రీట్జ్కే అతని కంటే చాలా ముందుకు వెళ్ళాడు.




