IND vs SA: రెండో మ్యాచ్లో ఓటమి.. దెబ్బకు ఆ ప్లేయర్ ఔట్..జట్టులోకి కొత్త ఆల్‌రౌండర్

|

Nov 13, 2024 | 8:48 PM

టీమిండియాతో జరిగుతున్న మూడోవ టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆల్ రౌండర్ రమన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆవేశ్ ఖాన్ ప్లేస్లో రమన్ సింగ్ కు ఛాన్స్ వచ్చింది.

IND vs SA: రెండో మ్యాచ్లో ఓటమి.. దెబ్బకు ఆ ప్లేయర్ ఔట్..జట్టులోకి కొత్త ఆల్‌రౌండర్
South Africa Won The Toss And Bowl Against In India In Third T20 Match In Centurion
Follow us on

టీమిండియాతో జరిగుతున్న మూడోవ టీ20లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆల్ రౌండర్ రమన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేశాడు. ఆవేశ్ ఖాన్ ప్లేస్లో రమన్ సింగ్ కు ఛాన్స్ వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి, రెండో మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా ఆట పర్వాలేదనిపించింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు చేయగా, రెండో మ్యాచ్‌లో టాప్, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలింగ్ బలంగానే ఉన్నప్పటికీ సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇప్పుడు సిరీస్ గెలవాలన్నా.. ఓటమి నుంచి తప్పించుకోవాలన్నా.. సెంచూరియన్ వేదికగా జరిగే మూడో టీ20లో భారత్ గెలవాల్సిందే. ఓ వైపు యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది.

టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్  ఈరోజు సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరగనుంది. తొలి మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను సులభంగా ఓడించిన భారత్ రెండో మ్యాచ్‌లో 124 పరుగులకే ఆలౌటైంది. తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ శాంసన్ రెండోవ మ్యాచ్లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. అయితే అభిషేక్ శర్మ రెండు మ్యాచుల్లోను విఫలమైయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ అభిషేక్ శర్మకి చివరి అవకాశం కావచ్చు. కెప్టెన్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా పూర్తి ఫామ్‌లో లేడు. అయితే తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌లో ఆశించినంతగా ఆడటం లేదు. రెండో మ్యాచ్లోటీమిండియాను దక్షిణాఫ్రి ఓడించడం కాస్త బాధించింది. ఆ మ్యాచ్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసిన ప్రయోజనం లేకపోయింది.

సూపర్‌స్పోర్ట్ పార్క్ పిచ్ స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదు. ఈ మైదానంలో, T20లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో, కేవలం 2 స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు, అది కూడా ఆరు మరియు ఏడో స్థానంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఫాస్ట్ బౌలర్లపై భారం పడినా ప్రస్తుత ఫామ్ చూస్తుంటే దక్షిణాఫ్రికా పేస్ విభాగం మరింత పటిష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గెరాల్డ్ కోయెట్జీ, మార్కో జాన్సన్‌ల ఘోరమైన బౌలింగ్ టీమ్ ఇండియాను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. అటువంటి పరిస్థితిలో, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, హార్దిక్ పాండ్యాలు టీమిండియా తరుపున పెద్ద పాత్ర పోషించవలసి ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి