
Temba Bavuma Celebration: క్రికెట్ ప్రపంచం ఇప్పుడు సౌత్ ఆఫ్రికా విజయగానంతో మారుమోగుతోంది. 27 సుదీర్ఘ సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ, లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ 2025లో ఆస్ట్రేలియాను మట్టికరిపించి దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రక విజయం, ముఖ్యంగా కెప్టెన్ టెంబా బావుమా మ్యాచ్ గెలిచిన తర్వాత WTC మేస్‌తో చేసిన సెలబ్రేషన్, అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. కేజీఎఫ్ సినిమాలోని రాకీ భాయ్ స్టైల్‌లో బావుమా చేసిన ఈ సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయం వెనుక వ్యధ..
దక్షిణాఫ్రికా జట్టుకు “చోకర్స్” అనే అపఖ్యాతి ఉంది. ఐసీసీ టోర్నమెంట్లలో కీలక సమయాల్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం ఆ జట్టుకు అలవాటు. అలాంటి జట్టు, ప్రపంచ క్రికెట్‌లో అత్యంత పటిష్టమైన ఆస్ట్రేలియాను ఫైనల్‌లో ఓడించి, WTC టైటిల్‌ను గెలుచుకోవడం ఒక అద్భుతం. ఈ విజయం వెనుక కెప్టెన్ టెంబా బావుమా అసాధారణ పోరాటం, పట్టుదల ఉన్నాయి. హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్నప్పటికీ, అతను అద్భుతమైన 66 పరుగులు చేసి, ఐడెన్ మార్క్రామ్ (136) తో కలిసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్ళాడు. గాయంతో కుంటుకుంటూ పరుగులు తీసినా, అతని పట్టుదల, దృఢసంకల్పం ప్రతీ బంతిలో కనిపించాయి.
కేజీఎఫ్ స్టైల్ సెలబ్రేషన్..
#SouthAfrica #TembaBavuma#WtcFinal2025 #WTC2O25Final pic.twitter.com/4j2hj9iPyd
— cinepics (@cinepiccollx) June 14, 2025
చారిత్రాత్మక విజయం అనంతరం జట్టు సభ్యులతో కలిసి టెంబా బావుమా WTC మేస్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో అతని ముఖంలో కనిపించిన భావోద్వేగాలు, ఆనందం అపరిమితం. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మేస్‌తో అతను చేసిన సెలబ్రేషన్. ప్రముఖ కన్నడ చిత్రం ‘కేజీఎఫ్’ లో హీరో రాకీ భాయ్ తన ప్రత్యర్థులను చిత్తు చేసి, తన సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చేసే సెలబ్రేషన్ గుర్తుకు వచ్చేలా, బావుమా WTC మేస్‌ను గాల్లోకి ఎత్తి, అమాంతం పైకెత్తి, ఆ తర్వాత ప్రత్యర్థులపై ఫిరంగుల వర్షం కురిపించేలా మెస్‌తో చేసిన సీన్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ క్షణం కేజీఎఫ్ సినిమాలోని ఐకానిక్ సన్నివేశాలను గుర్తు చేసింది.
వైరల్ వీడియో..
ICC World Test Champions 2025!#WtcFinal2025 #Proteas pic.twitter.com/LJnsfdHnhu
— Captain Springbok (@CaptSpringbok) June 14, 2025
టెంబా బావుమా WTC మేస్‌తో సెలబ్రేట్ చేసుకున్న వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బావుమాను “లార్డ్ బావుమా” అని కీర్తిస్తూ, దక్షిణాఫ్రికాకు ఈ విజయం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ ట్వీట్లు, పోస్టులు చేశారు. “చోకర్స్” అనే ట్యాగ్‌ను తుడిచిపెట్టి, దక్షిణాఫ్రికా క్రికెట్‌కు ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన బావుమా, కేవలం తన బ్యాటింగ్‌తోనే కాకుండా, తన ఉద్వేగభరితమైన సెలబ్రేషన్‌తోనూ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాడు.
Congratulations sir @TembaBavuma 🫡#WtcFinal2025 #AUSvsSA #Bavuma pic.twitter.com/gz8N0NzaMA
— Fahim Ansari (@FaimAnsari93) June 14, 2025
ఈ విజయం దక్షిణాఫ్రికా క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. టెంబా బావుమా కెప్టెన్సీలో, యువ జట్టు అద్భుతంగా రాణించి, క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేసింది. రాబోయే కాలంలో దక్షిణాఫ్రికా క్రికెట్ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఈ విజయం స్ఫూర్తిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..