2 సెంచరీలు, 508 పరుగులు.. అరంగేట్రంలో దంచికొట్టినా.. కేవలం 49 రోజుల్లోనే కెరీర్ క్లోజ్.. ఆ ప్లేయర్ ఎవరంటే?

|

Jan 22, 2023 | 1:49 PM

అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్లేయర్.. ఆస్ట్రేలియాపై మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత, తదుపరి 3 టెస్టుల్లో అతని స్కోర్లు 140, 65, 35, 81, 126లు చేశాడు.

2 సెంచరీలు, 508 పరుగులు.. అరంగేట్రంలో దంచికొట్టినా.. కేవలం 49 రోజుల్లోనే కెరీర్ క్లోజ్.. ఆ ప్లేయర్ ఎవరంటే?
On This Day Cricket Records
Follow us on

క్రికెట్‌లో ఎన్నో స్పెషల్ డేస్ ఉంటుంటాయి. ఇవి కొందరికి జీవితాంతం గుర్తుండేలా చేస్తే.. మరికొందరికి చాలా బ్యాడ్ డేస్‌గా మారుతుంటాయి. ఇలాంటిదే ఓ ఆటగాడి జీవితంలోనూ ఇలానే జరిగింది. ఆ ఆటగాడు అరంగేట్రం చేసిన సమయంలో ఎన్నో ఆశలతో కనిపించాడు. కానీ, కేవలం 49 రోజుల్లోనే కెరీర్ ముగించుకున్నాడు. కానీ, ఓ వివాదం వల్ల.. మరోసారి రీఎంట్రీ చేయలేకపోయాడు. అరంగేట్రంలోనే దక్షిణాఫ్రికా కోసం ఎంతో చేశాడు. ఎక్కువ పరుగులు చేశాడు. ఎక్కువ మ్యాచ్‌లు గెలిచాడు. ఎందుకంటే అతను ఆ 49 రోజుల్లో తన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పాడు.

మేం బారీ రిచర్డ్స్ గురించి మాట్లాడుతున్నాం. అది 1970వ సంవత్సరం. తేదీ జనవరి 22, స్థలం కేప్ టౌన్. అంటే సరిగ్గా 53 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికాకు చెందిన బారీ రిచర్డ్స్ ఆస్ట్రేలియాతో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. టెస్టు క్రికెట్‌లో ఈ రోజే అరంగేట్రం చేశాడు.

49 రోజుల్లో 4 టెస్టులు, 508 పరుగులు..

22 జనవరి 1970న అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బారీ రిచర్డ్స్.. ఆస్ట్రేలియాపై మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత, తదుపరి 3 టెస్టుల్లో అతని స్కోర్లు 140, 65, 35, 81, 126. అంటే అతని బ్యాట్ నుంచి 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల ఇన్నింగ్స్‌లు వచ్చాయి. ఈ విధంగా, అతను కేవలం నాలుగు టెస్టుల్లో 72.57 సగటుతో 508 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

49 రోజుల్లోనే అంతర్జాతీయ కెరీర్ క్లోజ్..

బ్యారీ రిచర్డ్స్ బ్యాటింగ్ కారణంగా, ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కానీ, ఈ ప్లేయర్ కెరీర్‌లో మొదటి సిరీస్, చివరి సిరీస్ కూడా ఇదే. ఆ సమయంలో దక్షిణాఫ్రికాలో వర్ణవివక్ష అనే మంట రగిలింది. దక్షిణాఫ్రికాలో ఈ వివక్ష తారాస్థాయికి చేరుకుంది. ఈ వివక్ష దక్షిణాఫ్రికాను క్రికెట్ సోదరభావం నుంచి దూరం చేసింది. ఇది బారీ రిచర్డ్స్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసేందుకు కారణం అయింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..