Sourav Ganguly: జట్టు ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాత్ర ఉందా.. వైరల్ అవుతున్న ఫొటో..

|

Feb 04, 2022 | 7:06 PM

విరాట్ కోహ్లీ(virat kohli) టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించారు...

Sourav Ganguly: జట్టు ఎంపికలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పాత్ర ఉందా.. వైరల్ అవుతున్న ఫొటో..
Bcci
Follow us on

విరాట్ కోహ్లీ(virat kohli) టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించారు. టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి టీమ్‌ సెలక్షన్‌ సమావేశంలో కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగే నిర్ణయాన్ని చెప్పగా, అందరూ అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని సౌరవ్ గంగూలీ(sourav ganguly) చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి జట్టు ఎంపికలో గంగూలీ జోక్యం చేసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. భారత అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన గంగూలీ ఇప్పుడు ఈ ఆరోపణలపై మాట్లాడాడు. గంగూలీ, బీసీసీఐ(bcci) సెక్రటరీ జయ్ షా(jai sha) మధ్య వివాదం నడుస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. జయ్ షాతో వివాదం వార్తలకు సంబంధించి కూడా గంగూలీ స్పందించాడు. గంగూలీ సెలక్షన్ కమిటీలోని వ్యక్తులతో కలిసి ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతోంది. జట్టు ఎంపికలో గంగూలీ జోక్యం చేసుకుందనే విషయాన్ని సమర్ధిస్తూ ఈ ఫొటో ఉంది.

న్యూస్ ఏజెన్సీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సెలక్టర్లపై ఒత్తిడి తెచ్చేందుకే సెలక్షన్ కమిటీని ప్రభావితం చేస్తున్నారంటూ మీపై ఆరోపణలు వచ్చాయని ప్రశ్నించగా. దీనికి గంగూలీ బదులిస్తూ, “ఈ విషయంపై నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఈ నిరాధార ఆరోపణలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను బీసీసీఐ అధ్యక్షుడిని, బీసీసీఐ అధ్యక్షుడు చేయాల్సిన పని నేను చేస్తున్నాను.

ఈ ఫొటో గురించి గంగూలీ మాట్లాడుతూ, “అలాగే నేను సెలక్షన్ కమిటీ సమావేశంలో కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో సెలక్షన్ కమిటీ సమావేశానికి సంబంధించినది కాదని నేను స్పష్టం చెబుతున్నాను. (ఈ ఫోటోలో గంగూలీ బీసీసీఐ సెక్రటరీ జయ్ షా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, జాయింట్ సెక్రటరీ జయేష్ జార్జ్‌తో కలిసి కూర్చున్నాడు.) జార్జ్ సెలక్షన్ కమిటీలో భాగం కాదు” అని అన్నాడు.

బీసీసీఐ సెక్రటరీ జయ్ షాతో తనకు ఉన్న సంబంధాల గురించి గంగూలీని అడిగినప్పుడు, “నాకు జైతో మంచి అనుబంధం ఉంది. అతను నాకు చాలా సన్నిహితుడు, విశ్వసనీయ సహచరుడు. నేను, జై, అరుణ్ ధుమాల్, జార్జ్ అందరం కలిసి ఈ రెండేళ్లలో కోవిడ్ వల్ల ఏర్పడిన ఇబ్బందుల నుండి బోర్డును గట్టెక్కించడానికి కృషి చేస్తున్నాము. ఈ రెండేళ్లు అద్భుతంగా గడిచాయని చెప్పొచ్చు. టీమ్‌గా అన్ని పనులు చేశాం.

Read Also.. Sourav Ganguly: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ విజయం సాధించారా.. ఆ విషయం మచ్చగా మిగలనుందా..