భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, 2024లో తన నాలుగో ODI సెంచరీతో క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసింది. ఆస్ట్రేలియాతో WACA మైదానంలో జరిగిన మ్యాచ్‌లో, భారత జట్టు ఓడిపోయినా, మంధాన పోరాట ఇన్నింగ్స్‌తో అత్యుత్తమ ప్రదర్శన చూపించింది. ఈ సెంచరీ, మహిళల ODIల్లో ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు క్రియేట్ చేసింది మంధాన
మంధాన 99 బంతుల్లో 110 పరుగులు సాధించగా, ఆమె ఇన్నింగ్స్ భారత జట్టు ఛేదనలో ప్రముఖ పాత్ర వహించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యం ముందు మిగతా బ్యాటర్‌లు విఫలమయ్యారు. రిచా ఘోష్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ లాంటి ప్లేయర్లు తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. లోయర్ ఆర్డర్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లు చేయడం వల్ల, మంధాన ఒంటరిగా జట్టును గెలిపించడానికి పోరాడింది.
14వ ఓవర్‌లో 50 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన మంధాన, తర్వాత కేవలం 103 బంతుల్లో సెంచరీ చేరుకుంది. కానీ, 105 పరుగుల వ్యక్తిగత స్కోరులో ఆమె ఔటవడం జట్టును మరింత సంక్షోభంలోకి నెట్టింది. మిగతా బ్యాటర్ల మద్దతు లేకుండా, ఆమె పోరాట ఇన్నింగ్స్ భారత జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.
ఈ సెంచరీ 2024లో మంధాన సాధించిన నాల్గోది. ఇప్పటికే దక్షిణాఫ్రికాపై రెండు, న్యూజిలాండ్‌పై ఒక సెంచరీలను చేర్చుకుని, ఒకే క్యాలెండర్ సంవత్సరంలో నాలుగు సెంచరీలు చేసిన మొదటి మహిళా ఆటగాళ్లలో ఒకరిగా మంధాన నిలిచింది. ఈ ఘనతతో ఆమె గతంలో ఉన్న మూడు సెంచరీల రికార్డును అధిగమించింది.
మంధాన ఇప్పటి వరకు తన ODI కెరీర్‌లో తొమ్మిది సెంచరీలు నమోదు చేసుకుంది. ఆమె నాట్ స్కివర్-బ్రంట్, చమరి అతపత్తు, షార్లెట్ ఎడ్వర్డ్స్ వంటి క్రికెట్ దిగ్గజాలతో నాలుగో స్థానాన్ని పంచుకుంటోంది. టామీ బ్యూమాంట్ పేరున ఉన్న 10 వన్డే సెంచరీల రికార్డును మంధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది.
2024లో మంధాన ప్రదర్శన భారత మహిళా క్రికెట్ టీమ్‌కు ప్రేరణగా నిలిచింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో భారత జట్టు అంతగా మెరుగైన ప్రదర్శన చేయకపోయినా, మంధాన తన ఫామ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ బ్యాటర్‌గా తన స్థానం పటిష్టం చేసుకుంది.
First woman to score four ODI centuries in a calendar year. Smriti Mandhana is special 🤌🏻#AUSvIND pic.twitter.com/kTGN2J3K10
— Women’s CricZone (@WomensCricZone) December 11, 2024