Shocking: అంపైర్ పొరపాటుతో 1993 తర్వాత వన్డేలో అరుదైన ఘటన.. కళ్లుమూసుకుంటే ఎలా బ్రో అంటూ నెటిజన్ల కామెంట్స్..

SL vs NZ: కివీస్ బౌలర్ ఐడాన్ కార్సన్ 1993 తర్వాత ODI చరిత్రలో 11 ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసిన మొదటి బౌలర్‌గా నిలిచింది.

Shocking: అంపైర్ పొరపాటుతో 1993 తర్వాత వన్డేలో అరుదైన ఘటన.. కళ్లుమూసుకుంటే ఎలా బ్రో అంటూ నెటిజన్ల కామెంట్స్..
Eden Carson Bowls 11 Overs

Updated on: Jul 02, 2023 | 11:16 AM

క్రికెట్ ఆటలో అంపైర్ కీలక పాత్ర పోషిస్తాడు. అంపైర్ నిర్ణయంతో చాలా మ్యాచ్‌ల ఫలితాలు మారిపోతుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. అంపైర్ చేసిన తప్పిదం వల్ల ఎలాంటి విపత్తు జరగకపోయినా వన్డే క్రికెట్‌లో ఓ ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. నిజానికి, న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక మహిళల మధ్య జరిగిన రెండవ వన్డే (SriLanka vs Newzealand) వన్డే క్రికెట్ చరిత్రలో చాలా అరుదైన సంఘటనకు సాక్షిగా నిలిచింది. కివీస్ బౌలర్ ఐడాన్ కార్సన్ 1993 తర్వాత అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ నిర్లక్ష్యం కారణంగా ODI క్రికెట్ చరిత్రలో 11 ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసిన మొదటి బౌలర్‌గా నిలిచింది.

11 ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసిన బౌలర్..

న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ బౌలర్ ఐడాన్ కార్సన్ 11 ఓవర్ల స్పెల్ బౌలింగ్ చేసింది. మ్యాచ్ 45వ ఓవర్ వేసిన వెంటనే కార్సన్ 10 ఓవర్లు పూర్తయ్యాయి. అయితే, న్యూజిలాండ్ బౌలర్ ఇన్నింగ్స్ 47వ ఓవర్ బౌలింగ్ చేసి వన్డే చరిత్రలో 11 ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా నిలిచింది. ఇది అంపైర్ లేదా మ్యాచ్ రిఫరీ దృష్టికి వెళ్లలేదు. వారి నిర్లక్ష్యం ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.

ఐడాన్ కార్సన్ బౌలింగ్ మాయాజాలం..

ఐడాన్ కార్సన్ తన 11 ఓవర్ల స్పెల్‌లో కేవలం 41 పరుగులు మాత్రమే ఇచ్చి శ్రీలంక ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు పెవిలియన్ దారి చూపించింది. ఈ కివీస్ బౌలర్ తన 11వ ఓవర్‌లో 5 డాట్ బాల్స్ వేసిరి, ఒక రన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

వన్డే సిరీస్‌ 1-1తో సమం..

శ్రీలంకతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 329 పరుగులు చేసింది. జట్టులో సోఫియా డివైన్, అమిలా కెర్ సెంచరీలు చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 229 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వన్డే క్రికెట్‌లో శ్రీలంకపై ఇదే అత్యధిక భాగస్వామ్యం. అమిలా కెర్ 108 పరుగులు చేయగా, డెవిన్ 137 పరుగులు చేసింది. 330 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 218 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..