- Telugu News Photo Gallery Cricket photos Team India young player Prithvi Shaw may play for Northamptonshire in county cricket
Team India: విదేశీ లీగ్‌లపై కన్నేసిన మరో భారత ప్లేయర్.. రీఎంట్రీ కోసం తిప్పలు..
Prithvi Shaw: ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ టోర్నీ ముగిసిన తర్వాత నార్తాంప్టన్ షైర్ జట్టులో చేరనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒకవేళ ఈ నివేదిక నిజమైతే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పృథ్వీ షా ఆడడం ఇదే తొలిసారి కానుంది.
Updated on: Jul 02, 2023 | 11:36 AM

County Cricket: ప్రస్తుతం టీమిండియాకు దూరమైన ఓపెనర్ పృథ్వీ షా.. విదేశీ లీగ్‌లవైపు వెళ్లనున్నాడని, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడనున్నాడని సమాచారం వస్తోంది.

ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్న పృథ్వీ టోర్నీ ముగిసిన తర్వాత నార్తాంప్టన్ షైర్ జట్టులో చేరనున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఒకవేళ ఈ నివేదిక నిజమైతే కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పృథ్వీ షా ఆడడం ఇదే తొలిసారి కానుంది.

కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడతానని పృథ్వీ షా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, పృథ్వీ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, అందుకే కౌంటీలో ఆడతాడని చెబుతున్నారు.

భారత్ నుంచి కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన తొలి వ్యక్తి పృథ్వీ షా కాదు. గతంలో బిషన్ సింగ్ బేడీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి భారత దిగ్గజాలు కూడా నార్తాంప్టన్‌షైర్ తరపున ఆడారు.

పృథ్వీ షా కెరీర్‌ను పరిశీలిస్తే.. ఇప్పటి వరకు టీమిండియా తరపున 6 వన్డేలు, 5 టెస్టులు ఆడాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 42.37 సగటుతో 339 పరుగులు చేసిన పృథ్వీ.. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు.

ఇది కాకుండా టీమిండియా తరపున 6 వన్డేల్లో 31.50 సగటుతో 189 పరుగులు చేశాడు. పృథ్వీ షా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు, దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరపున ఆడుతున్నాడు.




