SL vs IND: శ్రీలంకతో రెండో టీ 20 మ్యాచ్ .. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?

|

Jul 28, 2024 | 8:10 PM

శనివారం (జులై 27) జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంతో పాటు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంక భావిస్తోంది.

SL vs IND: శ్రీలంకతో రెండో టీ 20 మ్యాచ్ .. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
SL vs IND
Follow us on

మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం (జులై 28) భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో మ్యాచ్ ప్రారంభమైంది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. శనివారం (జులై 27) జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యంతో పాటు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి సిరీస్ పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంక భావిస్తోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించాడు. నిన్నటి మ్యాచ్‌లో ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన కనబర్చిన శుభ్‌మన్ గిల్ అనారోగ్యం కారణంగా రెండో టీ20 మ్యాచ్‌కు అందుబాటులో లేడని, అతని స్థానంలో సంజూ శాంసన్‌ని తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు శ్రీలంక కూడా ఓ మార్పు చేసింది. దిల్షాన్ మధుశంక స్థానంలో రమేష్ మెండిస్‌ని జట్టులోకి చేర్చుకుంది.

మరోవైపు సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఈ సిరీస్ 3 మ్యాచ్‌లు. అందువల్ల సిరీస్‌లో శ్రీలంక సవాల్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ రెండో మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సిందే. కాబట్టి ఈ మ్యాచ్ శ్రీలంకకు ‘డూ ఆర్ డై’ మ్యాచ్.

ఇవి కూడా చదవండి

రెండు జట్లు

టీమ్ ఇండియా:

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్.

శ్రీలంక జట్టు:

పాతుమ్ నిస్సాంక, కుసాల్ మెండిస్ (వికెట్ కీపర్), కుసల్ పెరీరా, కమిందు మెండిస్, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, వనిందు హసరంగా, రమేష్ మెండిస్, మహిష్ థిక్షన్, మతీషా పతిరణ, అసిత ఫెర్నాండో.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..