IND Vs WI: ఆసియా కప్‌నకు ముందుగా టీమిండియాలో భయం.. భయం.! కారణం ఆ ఇద్దరు ప్లేయర్సే..

|

Aug 04, 2023 | 1:16 PM

ఈ ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు వరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత ఏడాదిగా మూడు ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు శుభ్‌మాన్ గిల్. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా గత ఏడాదిన్నర కాలంగా టీ20 ఫార్మాట్, ఐపీఎల్‌లో పరుగులు రాబట్టాడు. ఇక రాబోయే ఆసియా కప్, ప్రపంచకప్‌నకు ఈ ఇద్దరి స్థానం పక్కా అని భావించారు. కానీ ఇది మొదటికే ఎసురు వచ్చేలా ఉంది. ఇప్పుడు వీరిద్దరి ఫామ్‌తో.. టీమిండియాలో భయం.. భయం వాతావరణం కొనసాగుతోంది.

IND Vs WI: ఆసియా కప్‌నకు ముందుగా టీమిండియాలో భయం.. భయం.! కారణం ఆ ఇద్దరు ప్లేయర్సే..
Team India
Follow us on

టెస్టులు, వన్డేలు ముగిశాయి. ఇప్పుడు విండీస్‌తో టీ20 సిరీస్‌లో అమీతుమీ తేల్చుకుంటోంది టీమిండియా. ఇప్పటికే జరిగిన తొలి టీ20లో హార్దిక్ సేన పరాజయం పాలవ్వగా.. ఆదివారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి రెండు మెగా టోర్నమెంట్లు ఉండటంతో.. ముఖ్యంగా వన్డే సిరీస్ మీద అందరి దృష్టి పడింది. అయితే విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ప్రయోగాలు చేయడం, బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేర్పులతో.. రాబోయే మెగా టోర్నీల్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో ఇప్పుడు ప్రశ్నార్ధకరంగా మారింది. ఇక ఇప్పుడు ఆసియా కప్, వరల్డ్ కప్‌నకు ముందుగా టీమిండియా జట్టు భయం.. భయంగా ఉంది. ఇందుకు కారణం ఆ ఇద్దరు ఆటగాళ్ళే.. వారిద్దరూ మరెవరో కాదు.. శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్.

ఈ ఇద్దరు టీమిండియా స్టార్ ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు వరకు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. గత ఏడాదిగా మూడు ఫార్మాట్‌లతో పాటు ఐపీఎల్‌లోనూ పరుగుల వరద పారించాడు శుభ్‌మాన్ గిల్. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా గత ఏడాదిన్నర కాలంగా టీ20 ఫార్మాట్, ఐపీఎల్‌లో పరుగులు రాబట్టాడు. ఇక రాబోయే ఆసియా కప్, ప్రపంచకప్‌నకు ఈ ఇద్దరి స్థానం పక్కా అని భావించారు.

పేలవ ప్రదర్శన కనబరిచిన గిల్..

వెస్టిండీస్ పర్యటనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్ నుంచి బలమైన ప్రదర్శన ఎలాంటిది రాలేదు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో భాగమైన గిల్.. ఈ మూడు సిరీస్‌లలోనూ ఘోరంగా విఫలమయ్యాడు. ఒక్క ఇన్నింగ్స్‌లో తప్ప.. మరెందులోనూ భారీ స్కోర్ సాధించలేకపోయాడు. టెస్ట్ సిరీస్‌లోని మూడు ఇన్నింగ్స్‌లలో గిల్ 6, 10, 29 (నాటౌట్) పరుగులు చేశాడు. అలాగే మొదటి రెండు వన్డేల్లో అతడి స్కోర్లు 7, 34. మూడో వన్డేలో గిల్ 85 పరుగులు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు తొలి టీ20 మ్యాచ్‌లో మళ్లీ 3 పరుగులు మాత్రమే చేశాడు. అంటే మొత్తంగా 7 ఇన్నింగ్స్‌ల్లో 29 సగటుతో 174 పరుగులు మాత్రమే చేయగలిగాడు గిల్.

స్కై విధ్వంసం ఎక్కడ.?

మరోవైపు సూర్యకుమార్ యాదవ్ నుంచి వన్డే ఫార్మాట్‌లో ఇంకా చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. మూడు వన్డేల్లో సూర్య 19, 24, 35 పరుగులు చేశాడు. ఈ వైఫల్యం తర్వాత, అతడు కనీసం టీ20ల్లోనైనా అదరగొడతాడని అందరూ భావించారు. అయితే మొదటి టీ20లో అలాంటిదేమి జరగలేదు. కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంటే మొత్తంగా 4 ఇన్నింగ్స్‌ల్లో 25 సగటుతో 99 పరుగులు మాత్రమే చేశాడు స్కై. ప్రస్తుతం వీరిద్దరి ప్రదర్శన ఆసియా కప్‌నకు ముందుగా జట్టును ఇబ్బంది పెడుతుంది.