India vs New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. అతను వెన్ను గాయంతో బాధపడుతున్నట్లు బీసీసీఐ సోషల్ మీడియాలో ప్రకటించింది. టీం మేనేజ్‌మెంట్ శ్రేయాస్ స్థానంలో రజత్ పాటిదార్‌కు అవకాశం కల్పించింది. జనవరి 18 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. దీనికి ముందు భారత శిబిరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయ్యర్ గాయం గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ట్వీట్ చేసి సమాచారం ఇచ్చింది.
శ్రేయాస్ అయ్యర్ టీమ్ ఇండియాలో ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరుగాంచాడు. చాలా సందర్భాలలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతను దూరమయ్యాడు. అయ్యర్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయ్యర్‌ను మినహాయించడంతో రజత్ పాటిదార్‌ను టీమ్ ఇండియాలో చేర్చారు. దేశవాళీ మ్యాచ్‌ల్లో రజత అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే.
UPDATE – Team India batter Shreyas Iyer has been ruled out of the upcoming 3-match ODI series against New Zealand due to a back injury.
Rajat Patidar has been named as his replacement.
More details here – https://t.co/87CTKpdFZ3 #INDvNZ pic.twitter.com/JPZ9dzNiB6
— BCCI (@BCCI) January 17, 2023
న్యూజిలాండ్‌తో వన్డేలో తపలపడనున్న భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రజత్ పాటిదార్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..