Shreyas Iyer Injury : క్రీజులో ఊహించని ప్రమాదం.. సొంత టీమ్ మేట్ దెబ్బకు శ్రేయస్ అయ్యర్ విలవిల

Shreyas Iyer Injury : ఐపీఎల్ 2026లో గాయపడిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చాడు. తను క్షేమంగా ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశాడు. తను గాయపడినా, తన టీమ్ గెలిచినందుకు అయ్యర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు.

Shreyas Iyer Injury : క్రీజులో ఊహించని ప్రమాదం.. సొంత టీమ్ మేట్ దెబ్బకు శ్రేయస్ అయ్యర్ విలవిల
Shreyas Iyer Injury

Updated on: Apr 01, 2026 | 10:11 AM

Shreyas Iyer Injury : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) గాయపడటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తన సొంత జట్టు ఆటగాడు కూపర్ కానోలీ కొట్టిన బుల్లెట్ లాంటి షాట్ నేరుగా అయ్యర్ చేతికి తగలడంతో, అతను మైదానంలోనే నొప్పితో విలవిలలాడాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితిపై శ్రేయస్ అయ్యర్ స్వయంగా స్పందిస్తూ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

నొప్పి తగ్గింది.. అంతా క్షేమమే

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంట్ వేడుకలో శ్రేయస్ అయ్యర్‌ను అందరూ అడిగిన మొదటి ప్రశ్న అతని గాయం గురించే. దీనికి అయ్యర్ నవ్వుతూ సమాధానమిచ్చాడు. “ప్రస్తుతం నేను చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నాను. పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదు, అంతా సాధారణంగానే ఉంది. ఏవో నెగటివ్ మాటలు చెప్పి అపశకునం తీసుకురావాలని నాకు లేదు. నేను చాలా పాజిటివ్‌గా ఉన్నాను, రాబోయే మ్యాచులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నాను” అని స్పష్టం చేశాడు. దీన్ని బట్టి చూస్తే అయ్యర్ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని అర్థమవుతోంది.

అసలు ఆ గాయం ఎలా అయ్యింది?

పంజాబ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఈ ఊహించని సంఘటన జరిగింది. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వేసిన బంతిని స్ట్రైకింగ్‌లో ఉన్న కూపర్ కానోలీ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ షాట్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందంటే, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అయ్యర్ తప్పించుకునే లోపే బంతి నేరుగా అతని ఎడమ చేతి వేళ్లకు బలంగా తగిలింది. ఒక్కసారిగా నొప్పితో మైదానంలోనే కుప్పకూలిన అయ్యర్ కోసం మెడికల్ టీమ్ రంగంలోకి దిగింది. అప్పట్లో మ్యాజిక్ స్ప్రే వేసి నొప్పి తగ్గించినా, మ్యాచ్ తర్వాత స్కానింగ్ అవసరమవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ అయ్యర్ మాటలతో ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి.

కానోలీ విధ్వంసంపై కెప్టెన్ ప్రశంసలు

తను గాయపడినా, తన టీమ్ గెలిచినందుకు అయ్యర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా అరంగేట్రం మ్యాచ్‌లోనే గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న కూపర్ కానోలీపై ప్రశంసల జల్లు కురిపించాడు. “కానోలీ ఆడిన తీరు అద్భుతం. తన తొలి మ్యాచ్‌లోనే అంత ఒత్తిడిలోనూ జట్టును గెలిపించడం సామాన్యం కాదు. అతని ఇన్నింగ్స్ మా టీమ్ కాన్ఫిడెన్స్‌ను పెంచింది” అని అయ్యర్ కొనియాడాడు. పంజాబ్ కింగ్స్ సమష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని, గాయం చిన్నదే కాబట్టి వచ్చే మ్యాచుల్లో మరింత జోరు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

 

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us