Rohit Sharma: నీకు నీ సేవలకు ఓ దండం ఇకనైనా దిగిపో..! హిట్‌మాన్‌ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు పెరుగుతున్నాయి. నాగ్‌పూర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అతను కేవలం 7 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. నెటిజన్లు అతని బ్యాటింగ్ ఫామ్‌ను ప్రశ్నిస్తూ, రిటైర్మెంట్ పట్ల తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. రోహిత్ త్వరగా అవుట్ అయినప్పటికీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో రాణించి టీమిండియాకు విజయాన్ని అందించారు. రానున్న మ్యాచ్‌ల్లో అయినా రోహిత్ శర్మ తన ఫామ్‌ను తిరిగి పొందగలడా అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిగా మారింది.

Rohit Sharma: నీకు నీ సేవలకు ఓ దండం ఇకనైనా దిగిపో..! హిట్‌మాన్‌ పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..
Rohit Sharma

Updated on: Feb 07, 2025 | 3:29 PM

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ కోసం పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తుండడంతో, భారత్ vs ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేలు ఒక విధంగా ఆ టోర్నమెంట్‌కు ప్రాక్టీస్ మ్యాచులుగా భావించబడుతున్నాయి. అయితే, ఈ సిరీస్‌లో తొలి వన్డేలో రోహిత్ శర్మ పూర్తిగా నిరాశపరిచాడు. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 7 బంతుల్లో 2 పరుగులు చేసి నిర్లక్ష్యంగా అవుట్ అయ్యాడు.

ఇప్పటికే కొంత కాలంగా తన ఫామ్‌ను కోల్పోయిన రోహిత్, మరోసారి తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌కు చేరడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అతని ఆటతీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు రోహిత్ ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ముగించాలని, యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ టెస్టుల్లో నే కాదు వన్డే ఫార్మాట్‌లో అతని బ్యాటింగ్ ఫామ్ కొంతకాలంగా దారుణంగా ఉంది. గత కొన్ని నెలలుగా అతని బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం వల్ల, అభిమానుల్లో అతనిపై నమ్మకం తగ్గినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా, ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను నిరాశపరిచిన తీరు, వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు పరంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది.

మ్యాచ్ వివరాలకు వస్తే, భారత్ 249 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (15 పరుగులు, 22 బంతుల్లో) మరియు రోహిత్ శర్మ కలిసి కేవలం 19 పరుగుల భాగస్వామ్యాన్ని మాత్రమే అందించారు. 4.3 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపగా, ఆపై 5.2 ఓవర్లో సాఖిబ్ మహ్మూద్ రోహిత్‌ను అవుట్ చేశాడు.

అయితే, రోహిత్ త్వరగా అవుట్ అయినప్పటికీ, శుభ్‌మన్ గిల్ (52) మరియు శ్రేయస్ అయ్యర్ (59) అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో టీమిండియాకు విజయాన్ని అందించారు. చివరకు, అక్షర్ పటేల్ (52) కూడా మెరుగైన ఇన్నింగ్స్ ఆడి, భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్ తర్వాత, రోహిత్ శర్మపై విమర్శలు మళ్లీ పెరిగాయి. అతని ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుపై ఎంతవరకు ప్రభావం పడుతుందో అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న మ్యాచుల్లో అయిన రోహిత్ తన బ్యాటింగ్‌తో విమర్శకులకు సమాధానం ఇస్తాడా లేక ఆ వ్యాఖ్యలకు బలం చేకురుస్తూ మరింత ఫేలవంగా ఆడతాడ ఆనేది అనేది చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..