T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..

| Edited By: Anil kumar poka

Oct 29, 2021 | 4:41 PM

టీ 20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో ఓడిపోయిన భారత్ నాలుగు రోజుల తర్వాత బుధవారం సాయంత్రం నెట్స్‎లో ప్రాక్టీస్ చేసింది. టీం ఇండియా అక్టోబర్ 31న ఆదివారం న్యూజిలాండ్‎తో తలపడనుంది...

T20 World Cup2021: 45 నిమిషాల పాటు కోహ్లీ బ్యాటింగ్.. కన్ను ఆర్పకుండా చూసిన ఇషాన్, శ్రేయాస్..
Kishan
Follow us on

టీ 20 ప్రపంచ కప్ 2021లో పాకిస్తాన్‎తో జరిగిన మ్యాచ్‎లో ఓడిపోయిన భారత్ నాలుగు రోజుల తర్వాత బుధవారం సాయంత్రం నెట్స్‎లో ప్రాక్టీస్ చేసింది. టీం ఇండియా అక్టోబర్ 31న ఆదివారం న్యూజిలాండ్‎తో తలపడనుంది. ఈ ప్రాక్టీస్ సెషన్‎లో టీం ఇండియా ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెమటోర్చాడు. కోహ్లి 45 నిమిషాల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. లాంగాన్‌, లాంగాఫ్‌, ఢిఫెన్స్‌, స్క్వేర్‌కట్‌, మిడ్‌ వికెట్‌ మీదుగా విరాట్ కొన్ని షాట్లు ఆడాడు. అక్కడే ఉ‍న్న యువ ఆటగాళ్లు శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ కన్ను ఆర్పకుండా కోహ్లీ బ్యాటింగ్‎ను చూశారు. ఈ వీడియోను ఐసీసీ ఇన్‎స్టాగ్రామ్‎లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది.

ఇషాన్ 15 మంది సభ్యులతో కూడిన జట్టులో భాగం అయితే ప్లేయింగ్ XIలోకి ప్రవేశించే అవకాశం రాలేదు. పాకిస్తాన్‎లో జరిగిన మ్యాచ్‎లో సూర్యకుమార్ యాదవ్‎కు చోటు కల్పించడంతో ఇషాన్ తుది జట్టులోకి ఎంపిక కాలేదు. స్టాండ్‌బై జాబితాలో ఉన్న ముగ్గురు ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ ఒకడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ పాకిస్తాన్‌పై హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‎తో జరిగే మ్యాచ్ ‎లో తన ఫామ్‎ను కొనసాగించాలని చూస్తున్నాడు. కోహ్లీతో పాటు, హార్దిక్ పాండ్యా కూడా సెషన్‌లో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే పాండ్యా న్యూజిలాండ్‎తో జరిగే మ్యాచ్‎లో బౌలింగ్ వేస్తాడా లేదా అన్న తెలియరాలేదు.

అయితే ఆదివారం జరిగే మ్యాచ్‎ న్యూజిలాండ్, ఇండియాకు కీలంగా మారింది. ఈ రెండు జట్లు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాయి. గ్రూప్-2లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఆప్ఘానిస్తాన్ రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండి, భారత్ మూడు, నాలుగు స్థానాల్లో ఉంది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్ ఇండియా, కీవిస్‎కు ముఖ్యగా మారింది. ఈ మ్యాచ్‎లో గెలిస్తేనే భారత్ సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. గ్రూప్-2లో ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‎లో గెలిచి అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండిస్ తర్వాతి స్థానాల్లో ఉంది.

Read Also.. Ind Vs Pak: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‎లో భారత్, పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉంది.. పాక్ కోచ్ సక్లైన్ ముస్తాక్..

Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..

David Warner: ఐపీఎల్ 2022 వేలంలో నా పేరు ఉండబోతుంది.. డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు..