Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే.. గ్రౌండ్ లో హర్భజన్, అక్తర్ డిష్యుం డిష్యుం.. వైరల్ వీడియో

క్రికెట్ లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ పోరుకు ఎంతో క్రేజ్ ఉంది. ప్రపంచంలోని క్రికెట్ అభిమానులందరూ ఈ మ్యాచ్ ను వీక్షిస్తారు. ఇక మైదానంలో ఆటగాళ్లు కూడా ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగుతుంటారు. తాజాగా అక్తర్, హర్భజన్ గ్రౌండ్ లోనే గొడవకు దిగారు.

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే.. గ్రౌండ్ లో హర్భజన్, అక్తర్ డిష్యుం డిష్యుం.. వైరల్ వీడియో
Shoaib Akhtar Vs Harbhajan

Updated on: Feb 10, 2025 | 10:11 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ పోటీకి మొత్తం 8 జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఈ టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లు లాహోర్, కరాచీ, రావల్పిండిలలో జరుగుతాయి. అదే సమయంలో టీం ఇండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగుతున్నాయి. ఈ మినీ వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే దుబాయ్ నుంచి ఒక వీడియో బయటకు వచ్చింది. ఈ వైరల్ వీడియోలో, టీమిండియా, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ పరస్పరం గొడవకు దిగారు. వీరిద్దరూ ఒకరినొకరు నెట్టుకుంటూ బాహబాహికి దిగారు. అయితే ఇది సీరియస్ గా కాదు. కేవలం సరదా కోసమే. ఇంటర్నేషనల్ లీగ్ టి-20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో వీరిద్దరూ ఇలా సరదాగా గడిపారు.

హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ ఇద్దరూ కొన్ని సంవత్సరాల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. మైదానంలో ఉన్నంతవరకు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూసే హర్భజన్, అక్తర్ బయట మాత్రం మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకరినొకరు ఎగతాళి చేసుకుంటారు. ఇప్పుడు దుబాయ్‌లో ఈ ఇద్దరి మధ్య ఇలాంటిదే జరిగింది. ILT20 ఫైనల్ కోసం హర్భజన్, అక్తర్ ఇద్దరూ దుబాయ్‌లో ఉన్నారు. వైరల్ వీడియోలో, వారిద్దరూ ఒకరినొకరు సవాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. భజ్జీ చేతిలో బ్యాట్ పట్టుకుని, అక్తర్ బంతి పట్టుకుని కనిపించారు. ఇద్దరూ ఒకరి వైపు ఒకరు దూసుకొచ్చారు. ఆ తర్వాత అక్తర్ భజ్జీని తోస్తాడు. ఆ తర్వాత, భజ్జీ అక్తర్‌కి సైగ చేసి బౌలింగ్ చేయమని అడుగడం ఈ వీడియో చూడవచ్చు. ‘ఛాంపియన్ ట్రోఫీ 2025 కోసం మేము ఇలా సిద్ధం అవుతున్నాం” అని ఈ వీడియోకి క్యాప్షన్ ఇచ్చాడు అక్తర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు, నెటిజెన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అక్తర్ వర్సెస్ హర్భజన్.. వీడియో ఇదిగో..

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..