
Shikhar Dhawan Spotted With Mystery Girl Dating Rumours: టీమిండియా ప్లేయర్ శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన ప్రవర్తనతో అభిమానులను అలరిస్తూ ఉంటాడు. అభిమానులు కూడా అతన్ని చూసేందుకు ఇష్టపడుతుంటారు. శిఖర్ ధావన్‌కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. దీంతో తమ అభిమాన క్రికెటర్ ఫన్నీ రీల్స్ కోసం ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఇదిలా ఉండగా, గురువారం, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్‌లో సందడి చేసిన శిఖర్ ధావన్.. అక్కడ అతను తన పాత స్నేహితులతో చాలా సరదాగా గడిపాడు. రెండవ మ్యాచ్‌లో, గబ్బర్‌తో స్టాండ్స్‌లో ఒక మిస్టరీ గర్ల్ కూడా కనిపించింది. ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శిఖర్ ధావన్, ఆ మిస్టరీ గర్ల్ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైలరవుతోంది.
ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కనిపించిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో శిఖర్ ధావన్ ఒక మిస్టరీ అమ్మాయితో కనిపిస్తున్నాడు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్ ఆస్వాదిస్తున్నారు. శిఖర్ ధావన్‌తో ఉన్న మిస్టరీ గర్ల్‌ని చూసి, అభిమానులు ఆమె కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతం, ఆ మిస్టరీ గర్ల్ గురించి ఎటువంటి సమాచారం లేదు. కానీ, ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Hahahha such a cute video 😆😆😆 #ShikharDhawan pic.twitter.com/P0PSrC9ydc
— Prernaa (@theprernaa) February 21, 2025
విడాకుల తర్వాత, శిఖర్ ధావన్ ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయేషా ముఖర్జీ నుంచి విడిపోయినప్పటి నుంచి ధావన్ వ్యవహారం గురించి ఎటువంటి వార్తలు రాలేదు. శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకులు 2023లో జరిగాయి. అప్పటి నుంచి అతను ఒంటరిగా ఉన్నాడు. ఆయేషా, శిఖర్ ధావన్‌లకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అతను తన తల్లి, ధావన్ మాజీ భార్యతో నివసిస్తున్నాడు. కోర్టు కొడుకు కస్టడీని ఆయేషా ముఖర్జీకి ఇచ్చినప్పటికీ, ధావన్ తన కొడుకును కలవడానికి ఎటువంటి పరిమితి లేదు. కానీ, ధావన్ తన కొడుకును రెండేళ్లుగా చూడలేదని, ఒక సంవత్సరం పాటు ఫోన్‌లో కూడా మాట్లాడలేదంట.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..