వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న కోహ్లీసేనకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో గాయపడ్డ ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడు గాయం నుంచి కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో అతని స్థానంలో వేరే ఆటగాడిని భర్తీ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను తుది జట్టుకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఇప్పటికే పంత్.. ఇంగ్లాండ్ చేరుకొని జట్టుతో పాటు సాధన చేస్తున్న సంగతి తెలిసిందే.
? JUST IN ?
Shikhar Dhawan ruled out of #CWC19 with thumb fracture.
India have sent a request to the ICC for inclusion of Rishabh Pant into the squad. pic.twitter.com/7s4y5rYt2e
— Cricbuzz (@cricbuzz) June 19, 2019